పశ్చిమగోదావరి

రేపటి నుండి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, అక్టోబర్ 9: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని వైభవాన్ని చాటే బ్రహోత్మవాలు చిన్నతిరుపతిలో మంగళవారం నుండి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటిగా ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి క్షేత్రం నిత్యం భక్తుల రద్దీతో విరాజిల్లుతోంది. వేలాదిమంది భక్తులు స్వామివారిని దర్శించుకుని తరిస్తున్నారు. నానాటికీ భక్తుల రాక పెరుగుతుండడంతో ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకే అంతరాలయంలో ఇద్దరు ధృవమూర్తులు ఉండడంతో ఏడాదికి రెండుసార్లు శ్రీవారి తిరుకల్యాణ మహోత్సవాలు జరపడం ఇక్కడ సంప్రదాయం. ఇందులో భాగంగా ఈ నెల 11 నుండి 18 వరకు ఆశ్వీయుజమాస తిరుకల్యాణ మహోత్సవాలు కన్నులపండువగా జరిపేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా 11న స్వామివారిని పెండ్లికుమారునిగా, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేస్తారు. 12న ధ్వజావరోహణ, 14న ఎదుర్కోలు ఉత్సవం జరుగనుంది. 15 రాత్రి తొమ్మిది గంటలకు స్వామివారి తిరు కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగనున్నట్టు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు. 16న రాత్రి రథోత్సవం, 17న శ్రీచక్రవార్యుత్సం, రాత్రి పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 18 రాత్రి జరుగనున్న శ్రీపుష్పయాగంతో ఉత్సవాలు పరిసమాప్తమవుతాయని ఇఒ వివరించారు. ఉత్సవాల సందర్భంగా ఆలయంలో జరుగనున్న నిత్య ఆర్జిత సేవలు, నిత్య కల్యాణాలు రద్దు చేస్తున్నట్టు ఆలయ ఇఒ వివరించారు.
అభివృద్ధి ఘనమే
శ్రీవారి క్షేత్రాన్ని భక్తులకు కనువిందు చేసేలా దేవస్థానం తీర్చిదిద్దింది. ప్రధానాలయం, ఉపాలయాల్లో పచ్చదనం భక్తులకు ఆహ్లాదాన్నిస్తోంది. మూడేళ్ల కాలంలో 48.27 కోట్ల రూపాయలతో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా 4.28 కోట్లతో నిత్య కల్యాణ మండపం, 2.29 కోట్లతో టిక్కెట్, ప్రసాదాల కౌంటర్లు, 3.58 కోట్లతో మాధవ కల్యాణమండపంలో డైనింగ్ హాలు, కిచెన్ షెడ్లు, నాలుగు కోట్ల రూపాయలతో అనివేటి మండపం, 2.5 కోట్లతో క్యాంటీన్ నిర్మాణ పనులు చేపట్టారు. అలాగే 14 కోట్లతో అన్నదాన భవనం, అయిదు కోట్లతో కేశఖండనశాల నిర్మాణం, మరో అయిదు కోట్లతో కొండదిగువకు బిటి ఘాట్‌రోడ్డు, 3.8 కోట్లతో శివాలయం వెనుక మరో బిటి ఘాట్‌రోడ్డు, 80 లక్షలతో గోసంరక్షణశాల నిర్మాణం, 48 లక్షలతో లింకు రోడ్లు నిర్మించారు. అలాగే 1.22 కోట్లతో మూడు ఒహెచ్‌ఎస్‌ఆర్ ప్లాంట్లు నిర్మించారు. అలాగే 62 లక్షలతో ఆగమ పాఠశాల అదనపు గదుల నిర్మాణం, 40 లక్షలతో సమాచార కేంద్ర భవన నిర్మాణాలు చేసి వాటిని భక్తులకు అందుబాటులోకి తెచ్చారు.
సౌకర్యాల కల్పనే ధ్యేయం
భక్తులకు మరిన్ని మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషిచేస్తున్నట్టు ఆలయ ఇఒ వేండ్ర త్రినాధరావు తెలిపారు.
స్వామివారి తిరు కల్యాణ మహోత్సవాలను వైభవంగా జరుపుతామని, వీటిని వీక్షించేందుకు భక్తులు తరలి రావాలని ఆయన కోరారు.