పశ్చిమగోదావరి

అంగరంగ వైభవంగా చిన వెంకన్న కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, అక్టోబర్ 15: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన చిన వెంకన్న కల్యాణ మహోత్సవం శనివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, మేళ తాళాలు, మంగళవాయిధ్యాలు నడుమ జరిగిన ఈ కల్యాణ తంతు భక్తులను పరవసింపజేసింది. ముందుగా ఆలయ ఆవరణలో తొళక్కం వాహనంపై స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం స్వామివారు, అమ్మవార్లను ఆలయ అనివేటి మండపంలో ఏర్పాటుచేసిన కల్యాణ మండపం వద్దకు అట్టహాసంగా తీసుకువచ్చారు. ఆ తర్వాత అర్చకులు కల్యాణ తంతును ప్రారంభించారు. ఆలయ ఛైర్మన్ ఎస్‌వి సుధాకరరావు పర్యవేక్షణలో ఇవో వేండ్ర త్రినాధరావు ఏర్పాట్లు చేశారు. కల్యాణ తంతులోని వివిధ ఘట్టాలను ఆలయ అర్చకులు పూర్తిచేసి శుభ ముహూర్త సమయంలో నూతన వధూవరుల శిరస్సులపై జీలకర్ర బెల్లం ధరింపజేసి మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకలను భక్తుల గోవింద నామస్మరణల నడుమ చేయించారు. ప్రభుత్వం తరపున గోపాలపురం ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించగా, దేవస్థానం తరపున ఆలయ ఛైర్మన్ సుధాకరరావు స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ తంతును వీక్షించిన భక్తులు పరవసించారు. స్వామివారి కల్యాణం అనంతరం స్వామివారు ఉభయదేవేరులతో వెండి గరుడ వాహనంపై ఊరేగారు.