పశ్చిమగోదావరి

స్ఫూర్తి ప్రదాత కలాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, అక్టోబర్ 15: విద్యార్థి లోకానికి భారతరత్న డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం చైతన్యస్ఫూర్తి ప్రదాత అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిసైల్స్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి సాంకేతిక సలహాదారు డాక్టర్ జి సతీష్‌రెడ్డి అన్నారు. స్థానిక కృష్ణదేవరాయ కాపు కల్యాణ మండపంలో శనివారం పిఎంఆర్ ఛారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో కలాం జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సతీష్‌రెడ్డి మాట్లాడుతూ కలలు కనండి - వాటిని సాకారం చేసుకోండి అంటూ విద్యార్థిలోకాన్ని నిద్రలేపిన చైతన్యస్ఫూర్తి ప్రదాత అబ్దుల్ కలాం అన్నారు. విశ్వంలో శక్తివంతుడైన మానవుడు నిరంతరం విద్యార్థుల జ్ఞానసముపార్జన చేయాలని కలాం తలచేవారన్నారు. ఆయనతో కలిసి పనిచేసే అవకాశం కలగడం తన అదృష్టమన్నారు. స్వాతంత్య్రం అనంతరం భారతీయ యువతరాన్ని చైతన్యవంతం చేసిన అతికొద్ది మందిలో కలాం తొలివరసలో ఉంటారన్నారు. ఎస్‌ఎల్‌వి లాంచర్ రూపొందించి ఇస్రో విజయాలకు మొదటి మెట్టు వేసిన వ్యక్తి అబ్దుల్ కలాం అన్నారు. ఫృథ్వీ, అగ్ని, త్రిశూల్, అకాష్, నాగ్ వంటి అయిదు క్షిపణులు అందించిన ఘనత ఆయనదేనన్నారు. త్రిశూల్, ఆకాష్ క్షిపణులు 90 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారన్నారు. భారతదేశంలో న్యూక్లియర్ పరీక్షలను ప్రోక్రాన్‌లో నిర్వహించడం ప్రపంచాన్ని అబ్బురపరిచేలా చేశారన్నారు. ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని కలాంతో అన్వయించుకోవాలన్నారు. మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ మానవాళి అభివృద్ధికి విభిన్న కోణాల్లో కలాం ఇచ్చిన స్ఫూర్తి మరువలేనిదన్నారు. ప్రముఖ గుండె వైద్యనిపుణులు డాక్టర్ సోమరాజుతో కలిసి అతిచౌకగా లభించే విధంగా గుండెలో అమర్చే స్టంట్‌ను రూపొందించిన ఘనత కలాంకే దక్కుతుందన్నారు. క్షిపణులు, విమానాలు తయారీలో వినియోగించే పరికరాలతో తేలికైన కృత్రిమ అవయవాలు తయారు చేసిన ఘనత కలాంకే దక్కుతుందన్నారు. సర్జికల్ స్ట్రయిక్స్‌తో వినియోగించే పరిజ్ఞానాన్ని అందించిన ఘనత డాక్టర్ సురేష్‌రెడ్డికి దక్కుతుందన్నారు. సమావేశంలో కాకినాడ జెఎన్‌టియు ఉప కులపతి ప్రొఫెసర్ వివిఎస్ కుమార్, సామాజిక కార్యకర్త మంతెన రామచంద్రరాజు, వాసవీ ఇంజినీరింగ్ కాలేజ్ ప్రొఫెసర్ డాక్టర్ ఎస్ కృష్ణమూర్తి, లెక్చరర్ దీపక్, ఎంఇఒ పాపారావు, శేషు, ఎమ్మెల్వో పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.