పశ్చిమగోదావరి

రేపు ముఖ్యమంత్రి రాక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 15 : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ నెల 17న జిల్లాకు రానున్నారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలిస్తారు. వాస్తవానికి ఇంతకుముందు పోలవరం పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ప్రతీ నెలా మూడవ సోమవారం ప్రత్యక్షంగా పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తానని, అలాగే ప్రతీ సోమవారం వర్చువల్ పరిశీలన చేస్తానని చెప్పడం తెలిసిందే. దానిలో భాగంగానే మూడవ సోమవారం అయిన ఈ నెల 17న చంద్రబాబు పోలవరం పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11.30 గంటలకు పోలవరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. ఆ తరువాత పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఇరిగేషన్, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారు.
సిఎం పర్యటనా ప్రాంతాలు పరిశీలించిన ఎస్పీ
పోలవరం: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఈ నెల 17న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పర్యటించనున్న దృష్ట్యా ఆ ప్రాంతాలను జిల్లా ఎస్పీ భాస్కర భూషణ్ శనివారం ఉదయం పరిశీలించారు. ఉదయం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్న ఎస్పీ హెలిఫ్యాడ్ ప్రాంతాన్ని, స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. అలాగే కాంట్రాక్టు క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష జరిపే సమావేశపు హాలును కూడా ఎస్పీ పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు. ఎస్పీ వెంట డిఎస్పీ జె వెంకట్రావు, ఆర్డీవో ఎస్ లవన్న, సిఐ కె బాలరాజు, ఎస్సై కె శ్రీహరిరావు తదితరులు ఉన్నారు.