పశ్చిమగోదావరి

చంద్రబాబుకు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, అక్టోబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను పరిశీలించేందుకు హెలికాఫ్టర్ ద్వారా సోమవారం ఉదయం 12 గంటలకు చేరుకున్నారు. సిఎంకు జిల్లా కలెక్టర్ కె భాస్కర్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, పోలవరం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు. అక్కడ నుండే స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. స్పిల్‌వే ప్రాంతంలో ఉన్న వర్షపునీటిని వారం రోజుల్లో తోడించాలని త్రివేణి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కార్తికేయన్‌ను ఆదేశించారు. ఆ తర్వాత రోడ్డు మార్గం ద్వారా స్పిల్‌వే నిర్మాణ ప్రాంతానికి చేరుకుని అక్కడ జరిగిన పనులను మ్యాప్ ద్వారా పరిశీలించి, వివరాలు తెలుసుకున్నారు. అక్కడ నుండి స్పిల్ ఛానల్ ప్రాంతానికి సమీపంలో ఉన్న కొండపైకి చేరుకుని భారీ ఎక్స్‌లేటర్‌తో మట్టిని తీసి డంపర్‌లో వేస్తున్న పనిని పరిశీలించారు. త్రివేణి ఇడి కార్తికేయన్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కాంట్రాక్టు ఏజన్సీ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న సిఎం భోజనానంతరం జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎస్పీలతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత జల వనరుల శాఖ అధికారులు, కాంట్రాక్టు ఏజన్సీల ప్రతినిధులతో ప్రస్తుత ప్రాజెక్టు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు. అనంతరం రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం చేయబోయే అనుసంధానం, పురుషోత్తమపట్నం వద్ద నిర్మిస్తున్న ఎత్తిపోతల పథకంతోపాటు పోలవరం ప్రాజెక్టు వద్ద చేపట్టిన పనులను గూర్చి విలేకరుల సమావేశంలో సిఎం చంద్రబాబు వివరించారు. అనంతరం సాయంత్రం 5.20 గంటలకు హెలికాఫ్టర్‌లో విజయవాడ బయల్దేరి వెళ్లారు. షెడ్యూల్ టైంకు 20 నిముషాలు ఆలస్యంగా వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచారు. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపిలు సిఎం వచ్చిన అర గంటకు నిర్మాణ ప్రాంతానికి చేరుకున్నారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఆలస్యంగా రావడంతో సిఎం కాన్వాయ్‌లోని విలేకర్ల వాహనం ఎక్కి కొద్ది దూరం పయనించారు. సిఎం పర్యటనకు వచ్చినా ప్రాజెక్టు నిర్మాణ పనులు అంతంత మాత్రంగానే జరిగాయి.