పశ్చిమగోదావరి

ఏడుగురు డిటిలకు పదోన్నతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 17: జిల్లాలో ఏడుగురు డిప్యూటీ తహసిల్దార్లకు తహసిల్దార్లగా తాత్కాలిక పదోన్నతి కల్పిస్తూ కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్టస్ధ్రాయిలో డిపిసి అనుమతి లభించిన తర్వాత మాత్రమే తహసిల్దార్లుగా పదోన్నతి కల్పించాల్సి ఉంటుంది. అయితే డిపిసి అనుమతి లభించడానికి అలస్యం అవుతున్న దృష్ట్యా అర్హత ఉన్న డిప్యూటీ తహసిల్దార్లకు తాత్కాలిక పద్దతిపై పదోన్నతి కల్పించేందుకు కలెక్టర్లకు అధికారాలు ఇస్తూ సిసిఎల్‌ఎ ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. దానిలో భాగంగా ప్రస్తుతం ఏలూరు తహసిల్దార్ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న చంద్రశేఖర్‌కు పదోన్నతి కల్పించి అక్కడే తహసిల్దార్‌గా నియమించారు. గతంలో ఇక్కడ తహసిల్దార్‌గా పనిచేసిన చవ్వాకుల ప్రసాద్ గతకొద్దికాలం నుంచి శెలవులో ఉండటంతో ఆయన స్ధానంలో పెదపాడు తహసిల్దార్ కుమార్ ఇన్‌ఛార్జి తహసిల్దార్‌గా వ్యవహరిస్తున్నారు. కాగా దెందులూరు తహసిల్దార్‌గా ప్రస్తుతం ఇన్‌ఛార్జి హోదాలో ఉన్న సత్యనారాయణకు పదోన్నతి కల్పించి అక్కడే తహసిల్దార్‌గా నియమించారు. భీమడోలులో డిప్యూటీ తహసిల్దార్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌కు పదోన్నతి కల్పించి పెనుగొండ తహసిల్దార్‌గా నియమించారు. నరసాపురం సబ్‌కలెక్టరు కార్యాలయంలో డిటిగా పనిచేస్తున్న సుందరరాజుకు పదోన్నతి కల్పించి నిడమర్రు తహసిల్దార్‌గా నియమించారు. తాడేపల్లిగూడెంలో డిటిగా పనిచేస్తున్న శ్రీనివాస్‌కు పదోన్నతి కల్పించి కుకునూరు సబ్‌కలెక్టరు కార్యాలయంలో డిఎఓగా నియమించారు. జిల్లా కలెక్టరు సిసిగా పనిచేస్తున్న శ్యాంప్రసాద్‌కు పదోన్నతి కల్పించి కలెక్టరేట్ సూపరింటెండెంట్‌గా నియమించారు. అలాగే గోపాలపురంలో డిటిగా పనిచేస్తున్న గొంతెయ్యకు పదోన్నతి కల్పించి నరసాపురం సబ్‌కలెక్టరు కార్యాలయంలో కెఆర్‌సి తహసిల్దార్‌గా నియమించారు.