పశ్చిమగోదావరి

గోదావరి జలాలే ఆధారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, ఏప్రిల్ 3: గోదావరి జలాలపైనే రాష్ట్రం ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని, ఈనేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిందని ఇఎన్‌సి ఎం వెంకటేశ్వరరావు వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలోని అతిథిగృహంలో విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఇఎన్‌సి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కృష్ణా, పెన్నా బేసిన్‌లో మిగులు జలాలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. భవిష్యత్తులో గోదావరి జలాలపైనే ఆధారపడాల్సి ఉందని వెంకటేశ్వరరావు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుని 2019 జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. స్పిల్‌వే నిర్మాణంలో 2.65 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులు జరగాల్సి ఉండగా ఇప్పటివరకు 2 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగిందన్నారు. మిగిలిన 65 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని మూడు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పవర్ హౌస్ పునాది పనులు డిసెంబర్ నాటికి పూర్తిచేసి, నిర్మాణ పనులను జెన్‌కోకు అప్పగిస్తామన్నారు. స్పిల్‌వే నిర్మాణంలో ప్రధానమైన పునాది తవ్వకం వచ్చే సీజన్ నాటికి పూర్తి చేసే విధంగా ప్రణాళిక రూపొందించామని చెప్పారు. ప్రస్తుతం రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల మట్టి పని జరుగుతోందని, 2 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పని జరిగే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించామన్నారు. ప్రపంచంలో అత్యంత అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఎల్‌అండ్‌టి, జర్మనీ బావరు సంస్థలు డయాఫ్రం వాల్ నిర్మాణంలో పాల్గొనడం మన అదృష్టమన్నారు. దేశ, విదేశాల్లో అత్యంత నిపుణులైన వ్యక్తులను ప్రాజెక్టు పనుల పరిశీలనకు పోలవరం అథారిటీ నియమించనున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్టు డిజైన్లకోసం ట్రాన్స్‌ట్రాయ్ కాంట్రాక్ట్ ఏజెన్సీ ఢిల్లీలోని ఇండో కెనడియన్ కన్‌స్ట్రక్షన్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుందని, వారు రూపొందించిన డిజైన్లు పరిశీలించేందుకు అథారిటీ ద్వారా సిడబ్ల్యుసికి పంపుతామన్నారు. స్పిల్‌వే డిజైనుకు అనుమతులు వచ్చిన వెంటనే కాంక్రీట్ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. డయాఫ్రం వాల్ పనులకు సంబంధించి, ఢిల్లీలోని ఐఐటి ప్రొఫెసరుకు పరిశీలనా బాధ్యతలు అప్పగించినట్టు ఇఎన్‌సి తెలిపారు. ఇసుకను గట్టిపరిచే ప్రక్రియ 70 శాతం మాత్రమే జరిగేలా అగ్రిమెంటు చేసుకున్నట్టు తెలిపారు. ఒక ప్రముఖ దినపత్రికలో 80 శాతం ఇసుక గట్టిపరిచే ప్రక్రియ జరుగుతోందని వచ్చిన వార్తలు అవాస్తవమన్నారు. ప్రస్తుతం ట్రయల్ రన్ పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని, ప్రతి 2 మీటర్లు, 2.5 మీటర్ల మధ్య ఇసుక సాంద్రత ఎంత అనే పరీక్షలు జరుగుతున్నాయన్నారు. ఇసుక గట్టి పరిచే పని మొదలు కాకుండానే 80 శాతం పనులు చేసి, వంద శాతం పనులుగా చూపిస్తున్నారని తప్పుగా వార్త ప్రచురిస్తున్నట్టు తెలిపారు. డ్యామ్ నిర్మాణానికి రూ.4 వేల 54 కోట్లు ఖర్చు చేస్తుండగా అందులో ఇసుక గట్టిపరిచే ప్రక్రియకు రూ.8.6 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. డ్యామ్ నిర్మాణ పనులకు రికార్డులు ఉంటాయని, ప్రతి పనికి ప్రిటెస్టు, పోస్టు టెస్టులు ఉంటాయని తెలిపారు. పూర్తి నాణ్యతతోనే డ్యామ్ నిర్మాణం జరుగుతుందని ఇఎన్‌సి వెంకటేశ్వరరావు తెలిపారు. ఆయన వెంట ప్రాజెక్టు ఎస్‌ఇ రమేష్‌బాబు ఉన్నారు.