పశ్చిమగోదావరి

31 నుండి కార్తీకమాస మహోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, అక్టోబర్ 23: స్వయంభూ శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి ఆలయంలో కార్తీక మాసోత్సవాల నిర్వహణకు సన్నాహాలు దాదాపు పూర్తి కావస్తున్నట్టు దేవస్థానం ఛైర్మన్ యిందుకూరి రంగరాజు, కార్యనిర్వహణాధికారి పెనె్మత్స విశ్వనాధరాజు(శివ) తెలిపారు. ఈనెల 31 నుండి నవంబర్ 29వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్టు తెలిపారు. కార్తీకమాస మహోత్సవాలలోనే ఆలయంలో సంప్రదాయంగా వస్తున్న త్రివింశతి వార్షిక సప్తాహ మహోత్సవాలు నవంబర్ 2 నుండి 9 వరకు ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 2 నుండి 5వ తేదీ వరకు హనుమత్ మండల దీక్షలు, నవంబర్ 19 నుండి 21 వరకు అర్థ మండల దీక్షలు స్వీకరించవచ్చని తెలిపారు. డిసెంబర్ 12న హనుమద్ వ్రతం, డిసెంబర్ 14న హనుమద్దీక్షల మహాపూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. కార్తీక మాసోత్సవాలలో భాగంగా కార్తీకమాసం ప్రతి శనివారం శ్రీ మద్ది ఆంజనేయస్వామివారికి లక్ష తమలపాకుల పూజ, ప్రతి ఆదివారం శ్రీ సువర్చలా హనుమత్కల్యాణం, ప్రతి సోమవారం లక్ష పుష్పార్చన నిర్వహించనున్నట్టు తెలిపారు. నవంబర్ 2న ప్రాతఃకాలార్చనతో సప్తాహమహోత్సవ పూజలు ప్రారంభమవుతాయని తెలిపారు. 9వ తేదీన త్రివింశతి వార్షిక సప్తాహ మహోత్సవాల పరిసమాప్తి, మహాపూర్ణాహుతి, దీక్షావిరమణ, వేద ఆశీర్వచనం, భజనపాళీలకు సత్కారం చేయనున్నట్టు వివరించారు. సప్తాహంలో భాగంగా 7వ తేదీన ఉపాలయం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కల్యాణోత్సవం చేయనున్నట్టు తెలిపారు. ఈ ఉత్సవాలకు వివిద ప్రభుత్వ శాఖలు సహకారం అందిస్తున్నట్టు చెప్పారు. ఉత్సవాలను మంత్రి పీతల సుజాత ప్రారంభిస్తారని తెలిపారు. ఉత్సవాలకు సుమారు అయిదు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసినట్టు చెప్పారు.