పశ్చిమగోదావరి

వైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 23: రాష్ట్రంలో నిరుపేదలుగా ఉన్న వైశ్యులను ఆదుకునేందుకు వీలుగా ఆర్యవైశ్య కార్పోరేషన్ ఏర్పాటుపై ముఖ్యమంత్రితో సంప్రదించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర ఆర్‌అండ్‌బి మంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. ఆదివారం మధ్యాహ్నం పాలకొల్లు ఆర్యవైశ్య కల్యాణ మండంపంలో నిర్మించిన ఎసి కల్యాణ మండపాన్ని ఆయన ప్రారంభించారు. సమాజంలో బడుగు, బలహీన వర్గాలకు సేవలందించడంలో ఆర్యవైశ్యులు ముందుండాలని, మానవ సేవే మాధవ సేవ అన్న విషయం ప్రతి ఒక్కరు గుర్తించాలని కోరారు. నెల్లూరు జిల్లాలో అమరజీవి పొట్టి శ్రీరాములు జన్మించిన గ్రామంలో రూ.20కోట్లతో రహదారుల అభివృద్ధి పనులు చేబట్టామని వెల్లడించారు. అవసరమైతే మరిన్ని నిధులు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ పుష్కరాలలో ఆర్యవైశ్యులు చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామమోహన్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఉండి ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ జయంతి వెంకటేశ్వర్లు, మాజీ అధ్యక్షుడు వబిలిశెట్టి కనకరాజు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి ప్రసంగించారు. వైశ్య సంఘ అధ్యక్షుడు తటవర్తి కృష్ణమూర్తి, కార్యదర్శి మామిడి బాబు, నాళం బాపిరాజు, ఛాంబర్స్ అధ్యక్షులు కొప్పు సత్యనారాయణ, శ్రీశైలం దేవస్థానం మాజీ అధ్యక్షుడు యిమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్ యిమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, బోనం నరసింహరావు, బోనం నాని, యడ్ల తాతాజీ, వైశ్య ప్రముఖులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.