పశ్చిమగోదావరి

శరవేగంతో రహదారుల అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, అక్టోబర్ 23: రాష్ట్రంలో రహదారులను శరవేగంతో అభివృద్ధి చేస్తున్నట్టు ఆర్‌అండ్‌బి శాఖ మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. రానున్న రెండేళ్లల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలుపుతామన్నారు. ఆదివారం పాలకొల్లు మండలం పూలపల్లి నుండి అగర్తిపాలెం వరకు రూ.9.8కోట్ల వ్యయంతో నిర్మించనున్న 8.6 కిలోమీటర్ల రోడ్డు పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా ప్రజా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో సిఎం చంద్రబాబు వెనుకడుగు వేయకుండా నిధులు వెచ్చిస్తూ సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలిపారు. ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోకుండా అభివృద్ధే లక్ష్యంగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు. సభకు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధ్యక్షత వహించి ప్రసంగించారు. రాష్ట్రాన్ని కరవు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు సిఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే నిమ్మల వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2018కే పూర్తిచేయించేందుకు సిఎం పట్టుదలతో ఉన్నారన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామోహన్, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మంత్రి శిద్ధా రాఘవరావును ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, ఎఎంసి ఛైర్మన్ గొట్టుముక్కల గాంధీభగవాన్‌రాజు, మున్సిపల్ వైస్ ఛైర్మన్ రోజారమణి, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ ఎంవి నిర్మల, ఇఇ కె విజయరత్నం, సర్పంచ్ నున్నబోయిన కళాజ్యోతి, జడ్పీటీసీ కోడి విజయలక్ష్మి, బోనం వెంకట నరసింహరావు, మండల, నియోజకవర్గ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.