పశ్చిమగోదావరి

అమ్మవార్లను తాకిన ఆదిత్య కిరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ద్వారకాతిరుమల, ఏప్రిల్ 3: సాయంసంధ్య వేళ.. భానుని కిరణాలు గర్భాలయంలో కొలువైన శ్రీనివాసుడు, పద్మావతీ ఆండాళ్లమ్మ వార్లను ఆపాదమస్తకం స్పృశించే శుభ సమయంలో వీక్షించిన భక్తులు ఆనంద పారవశ్యంలో మునిగిపోయారు. చైత్రమాసం ముందు రోజుల్లో సాక్షాత్కరించే ఈ అరుదైన ఘట్టం పురాతన దేవాలయమై, శ్రీవారి క్షేత్ర ఉపాలయంగా విరాజిల్లుతున్న లక్ష్మీపురంలోని జగన్నాథ వెంకటేశ్వరుని ఆలయంలో ఆదివారం ఆవిష్కృతమైంది. ఎక్కడా ఏ ఆలయంలోనూ లేనివిధంగా ఇక్కడ ఇలా సూర్యకిరణాలు నేరుగా స్వామి, అమ్మవార్లను తాకడం ఒక విశిష్ఠతగా చెబుతున్నారు. ఎంతో లోపలికి ఉండే ఈ ఆలయంలోకి స్వామి వారి గర్భాలయంలోకి సైతం నేరుగా సూర్యకిరణాలు ప్రవేశించి శ్రీవారిని, అమ్మవార్లను స్పృశించడాన్ని తిలకించిన భక్తులు పరవశించారు.