పశ్చిమగోదావరి

తగ్గిన సిజేరియన్ ప్రసవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 25: గర్భిణులకు అందిస్తున్న వైద్య సౌకర్యాలపై అవగాహన కల్పించడం ద్వారా జిల్లాలో సిజేరియన్ ప్రసవాలు గతేడాది 65 శాతం ఉండగా ఈ సంవత్సరం 60 శాతానికి తగ్గాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ కె కోటేశ్వరి చెప్పారు. ఏలూరులోని డిఎంహెచ్‌ఒ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం సిజేరియన్ ప్రసవాలు తగ్గించే అంశంపై జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కోటేశ్వరి మాట్లాడుతూ జిల్లాలో ప్రతీ ఆసుపత్రిలోనూ సాధారణ ప్రసవాలకు ప్రాధాన్యతనివ్వాలని గర్భిణులకు సాధారణ ప్రసవాల వలన కలిగే లాభాలను సిజేరియన్ చేయించుకోవడం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. ప్రసవ సమయంలో తమ పిల్లలు పడే బాధను చూడలేక తల్లిదండ్రులు సిజేరియన్‌కు ఆసక్తిచూపుతున్నారని వారి కోరిక మేరకు తప్పని పరిస్థితుల్లో సిజేరియన్ చేయవలసి వస్తోందని కొంతమంది డాక్టర్లు చెప్పడం పట్ల ఎట్టి పరిస్థితుల్లోనూ సిజేరియన్ ప్రసవాలు చేయకుండా వారి తల్లిదండ్రులు కూడా అవగాహన కల్పించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో తప్ప సిజేరియన్ ప్రసవాలకు డాక్టర్లు దూరంగా ఉండాలని సాధారణ ప్రసవాల వలన తల్లి - బిడ్డల ఆరోగ్య సంబంధమైన చిక్కులు తక్కువగా ఉండే అవకాశం వుంటుందని మాతృత్వ అనుభూతులు కూడా ఎక్కువగా వుంటుందని అన్నారు. జిల్లాలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో నూరుశాతం సిజేరియన్ ప్రసవాలు చేయడం పట్ల ఆమె అసహనం వ్యక్తం చేస్తూ ప్రతీ ఒక్క గైనకాలజిస్టు సిజేరియన్ ప్రసవాలను నూరుశాతం తగ్గించాలని చెప్పారు. జూన్ 2016 నుంచి ఆగస్టు 2016 వరకూ సాయిశే్వత ఎన్‌హెచ్ ఆసుపత్రితణుకులో మొత్తం 14 ప్రసవాలకు గాను మొత్తం సిజేరియన్ ప్రసవాలు జరిగాయని, రామచంద్ర ఎన్‌హెచ్ ఆసుపత్రి తణుకులో 7 ప్రసవాలకు నూరుశాతం సిజేరియన్, సాయి ఆసుపత్రి తణుకులో 11 ప్రసవాలకు 11 సిజేరియన్ ప్రసవాలు, క్రాంతి ఎన్‌హెచ్ ఆసుపత్రి తణుకులో, శ్రీనివాస మదర్ అండ్ చైల్డ్ ఆసుపత్రి తణుకులో, ప్రశాంతి ఆసుపత్రిలో, శ్రీకృష్ణ మదర్ చైల్డ్ ఆసుపత్రి, నటరాజు నర్సింగ్ హోమ్‌లలో నూటికి నూరుశాతం సిజేరియన్ ప్రసవాలు జరగడం పట్ల అందుకు గల కారణాలను డి ఎంహెచ్ ఓ ప్రశ్నించారు. గర్భస్థ లింగ నిర్ధారణ చేయడం చట్ట రీత్యా నేరమని లింగనిర్దారణ చేసే ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెడ్‌క్రాస్, ఇతర బ్లడ్ బ్యాంకులు అత్యవసర సమయంలో సైతం పేషెంట్లకు అవసరమైన రక్తం అందించడం లేదని కొంతమంది డాక్టర్లు డి ఎంహెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి దృష్టికి తీసుకురాగా త్వరలో బ్లడ్ బ్యాంకు అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి జిల్లాలో రక్తం కొరత కారణంగా పేషెంట్లు ఇబ్బంది పడే పరిస్థితి లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటానని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ డి ఎంహెచ్ ఓ డాక్టర్ పద్మజ, డెమో నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ హోమ్ ప్రెసిడెంట్ డాక్టర్ రమేష్ చంద్ర, ఐ ఎం ఏ ప్రెసిడెంట్ డాక్టర్ మద్దేశ్వరరావు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కన్సల్టెంట్ డాక్టర్ ముష్‌బా, జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రుల గైనకాలజిస్టులు తదితరులు పాల్గొన్నారు.