పశ్చిమగోదావరి

జిల్లాలో 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, అక్టోబర్ 27 : జిల్లాలో ఖరీఫ్ పంట ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి గిట్టుబాటు ధరకు కొనుగోలు చేసేందుకు 256 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు చెప్పారు. స్థానిక టిటిడిసిలో గురువారం వెలుగు గ్రూపులు, సహకార సొసైటీ సభ్యులకు ధాన్యం కొనుగోలుపై అవగాహనా సదస్సులను నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఖరీఫ్‌లో 13 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రావచ్చునని అంచనా వేయడం జరిగిందని, దీన్ని గిట్టుబాటు ధరకు కొనుగోలుచేసి 24 గంటల్లో సొమ్ము చెల్లించే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కామన్ రకం ధాన్యానికి 1470 రూపాయలు, గ్రేడ్ - ఏ రకానికి 1530 రూపాయలు కనీస మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందని, ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. జిల్లాలో ప్రతీ ఏటా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు చేయడం వలన 74 కోట్ల రూపాయలు కమిషన్ రూపంలో వెలుగు, సహకార సంఘాలకు చేరుతోందని చెప్పారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఎటువంటి అక్రమాలు జరిగినా సహించేది లేదని హెచ్చరించారు. డి ఆర్‌డి ఏ పిడి శ్రీనివాసులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ విషయంలో ఇష్టానుసారం ఖర్చులు చేస్తూ పలు గ్రూపులు అక్రమాలకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తించి ఖర్చుల నియంత్రణకు సెర్ఫ్ సి ఇవో స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. డి ఎస్‌వో డి శివశంకర్‌రెడ్డి, సివిల్ సప్లయిస్ డి ఎం ఎం గణపతిరావు, సహకార శాఖాధికారి ప్రసాద్, ఆర్‌డివో ఎన్ తేజ్‌భరత్ తదితరులు పాల్గొన్నారు.
ఊరకుక్కల దాడి: 20 మేకపిల్లలు మృతి
బుట్టాయగూడెం, అక్టోబర్ 27: ఊరకుక్కల దాడిలో ఇరవై మేకపిల్లలు హతమయ్యాయి. స్థానికుల కథనం ప్రకారం మండలంలోని రేగులకుంటలో గిరిజన రైతులు తెల్లం మల్లయ్య, తెల్లం రాములు తమ పొలంలో మేకలను మేపుతున్నారు. బుధవారం రాత్రి 8 గంటలకు తమ మందలోని రెండునెలల లోపు 20 మేకపిల్లలను వేరుగా గాబులో ఉంచి, భోజనానికి ఇంటికి వచ్చారు. తిరిగి రాత్రి 10 గంటలకు మేకల మకాం దగ్గరకు వచ్చేటప్పటికి సుమారు ఏడు ఊరకుక్కలు పిల్లమేకలను ఉంచిన గాబు కింద నుంచి గొయ్యి తవ్వి, గాబులో ఉన్న మేకపిల్లను పట్టి చంపేశాయి. వాటిలో మూడుపిల్లలను కుక్కలు ఈడ్చుకుపోగా, మిగిలిన మేకపిల్లలు చనిపోయి, చిందరవందరగా పడి ఉన్నాయి. రైతు సోదరులిద్దరూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.