పశ్చిమగోదావరి

ఇలా ఇంకెనే్నళ్లు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఏప్రిల్ 3: జిల్లాలో ఏలూరు కార్పొరేషన్ తర్వాత అంతటి ప్రత్యేకత కలిగింది భీమవరం పురపాలక సంఘం. సెలక్షన్ గ్రేడ్‌కు చేరుకున్న పట్టణవాసులకు నీటి ఇక్కట్లు తప్పడం లేదు. పంచాయతీ నుండి పట్టణంగా రూపాంతరం చెందిన నాటి నుండి ఇక్కడ పట్టణవాసులు ప్రతి వేసవిలో పడుతున్న నీటి ఇబ్బందులు వర్ణణాతీతం. ఈ ఏడాది ఎండలు ముందుగానే రావడంతో భానుడు తన ప్రతాపాన్ని చూపడం మొదలుపెట్టాడు. ప్రజలు కూడా దాహార్తితో అల్లాడిపోతున్నారు. పట్టణంలోని పలు వార్డులు, శివారు ప్రాంతాల ప్రజలు ట్యాంకర్ల ద్వారా వచ్చే తాగునీటి కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. కోట్లు మూలుగుతున్న భీమవరం మున్సిపాల్టీలో కనీసం శివారు ప్రాంతాలకు పైపులైన్ వేయలేని పరిస్థితి నెలకొంది. శివారు ప్రాంతాల్లో తాగునీటి కోసం బిందెలతో గంటల తరబడి వేచి చూసి ట్యాంకర్ వచ్చి నీటిని అందించే సమయానికి బిందెలతో గలాటాకు దిగి నీటిని పట్టుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని పలువురు మహిళలు పురపాలక సంఘంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.