పశ్చిమగోదావరి

ఆచంట ఉపసర్పంచ్‌గా లింగోలు ప్రమాణస్వీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆచంట, అక్టోబర్ 28:ఆచంట గ్రామ ఉపసర్పంచ్‌గా ఒకటో వార్డు మెంబర్ లింగోలు లక్ష్మణరావుచేత ఇఒపిఆర్‌డి మాధవరావు శుక్రవారం ప్రమాణస్వీకారం చేయించారు. లింగోలు లక్ష్మణరావు అభిమానులు వేలాదిగా ఊరేగింపుగా ఆచంటలోని మావుళ్లమ్మ గుడివద్ద నుండి తరలివచ్చారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సభ్యులందరి సమక్షంలో ఉపసర్పంచ్‌గా లింగోలు లక్ష్మణరావును ఏకగ్రీవగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా గ్రామసర్పంచ్ బీర తిరుపతమ్మ అధ్యక్షతన జరిగిన పదవీప్రమాణ స్వీకారసభలో సిద్ధాంతం వాటర్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ ఛైర్మన్ తమ్మినీడి ప్రసాద్, ఆచంట ఎఎంసి ఛైర్మన్ ఉప్పలపాటి సురేష్‌బాబు, వైస్‌ఛైర్మన్ రవిరాజు, జడ్పీటిసి బండి రామారావులు మాట్లాడుతూ పేదప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించే లక్ష్మణరావు గ్రామాభివృద్ధిలో చురుకైన పాత్రవహించాలని కోరారు. ఉపసర్పంచ్‌గా ఎన్నికైన లక్ష్మణరావును ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయకమిటీ సభ్యులు తోలేటి రాంబాబు, మండల టిడిపి అధ్యక్షుడు కేతామీరయ్య, ఆచంట కమిటీ అధ్యక్షుడు నెక్కంటి ప్రభాకరరావు, మాజీ ఎంపిపి భైరిశెట్టి ఆదిలక్ష్మి, చిలుకూరి సత్యవతి, పంచాయితీ కార్యనిర్వహణాధికారి పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.