పశ్చిమగోదావరి

రైతు రుణమాఫీ ఘనత చంద్రబాబుదేటిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్టి సుబ్రహ్మణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనుగొండ, అక్టోబర్ 28: దేశ చరిత్రలోనే ఎవరి సహకారం లేకుండా రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమేనని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెడ్టి సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం సాయంత్రం పెనుగొండ ఎఎంసి ఛైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో టిడిపి జిల్లా అధ్యక్షురాలు, ఎంపి తోట సీతామహాలక్ష్మి, రాష్ట్ర ప్రభుత్వ విఫ్ అంగర రామ్మోహనరావులు మాట్లాడుతూ నవంబర్ 1నుంచి టిడిపి ప్రభుత్వం చేపట్టబోయే జన చైతన్య కార్యక్రమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందన్నారు. ప్రతిపక్షాలు చేసే విమర్శలను సుశిక్షితులైన సైనికుల్లా తిప్పికొట్టాలన్నారు. ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పెనుగొండ ఎఎంసి ఛైర్మన్‌గా సానబోయిన గోపాలకృష్ణ, ఉపాధ్యక్షుడు బడేటి బ్రహ్మజీలచే ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో అచంట, పెనుగొండ మండలాలకు చెందిన సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, జడ్పీటీసీలు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో అభిమాన్లు పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని అభిమానులు పూలమాలలతో ముంచెత్తారు.