పశ్చిమగోదావరి

మెగా ఆక్వా ఫుడ్‌పార్కును తరలించాలని మహాధర్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నరసాపురం, నవంబర్ 4: తుందుర్రులో నిర్మిస్తున్న మెగా ఆక్వా ఫుడ్‌పార్కును మరో ప్రాంతానికి తరలించాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా శుక్రవారం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 20 గ్రామాల నుంచి ప్రజలు, రైతులు, మహిళలు పాల్గొన్నారు. వైసిపి, సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, జనతాదళ్ యూ పార్టీలు ఆందోళనకు మద్దతు పలికాయి. ఈ సందర్భంగా జరిగిన సభలో వైసిపి జిల్లా అధ్యక్షులు ఆళ్ల నాని మాట్లాడుతూ ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా ఆక్వా పార్కు నిర్మించడం సరికాదన్నారు. ప్రభుత్వం మొండిగా ఈ ఫ్యాక్టరీ నిర్మిస్తే భవిష్యత్‌లో తాళం వేసుకోవల్సి వస్తుందని హెచ్చరించారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణం ఆపేంతవరకూ ఉద్యమం ఆగదన్నారు. సముద్ర తీర గ్రామంలో ఫుడ్ పార్కు నిర్మిస్తే తాము పూర్తిస్థాయిలో సహకరిస్తామన్నారు. అలాగే రాష్ట్రంలో మూసివేసిన 1500 పరిశ్రమలను తెరిపించి నిరుద్యోగులకు ఉపాది కల్పించాలని ఉమా మహేశ్వర రావు కోరారు. ఫుడ్‌పార్కు నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలు నుంచి విడుదలైన నాయకులకు ఈ సందర్భంగా పూలమాలలు వేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసన సభ్యులు ఆర్‌ఎస్, ముదునూరి ప్రసాదరాజు, కారుమూరి నాగేశ్వర రావు, సిపిఎం జిల్లా కార్యదర్శి బలరామ్, సిపిఐ రాష్ట్ర నాయకులు నెక్కంటి సుబ్బారావు, జనతాదళ్ యూ నాయకులు డాక్టర్ శిరిగినీడి నాగభూషణం తదితరులు మాట్లాడారు.