పశ్చిమగోదావరి

జిల్లా అభివృద్ధిచెందితే సంతోషిస్తా: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 4 : పొగడ్తలకు తాను సంతోషించనని, తన లక్ష్యం మేరకు పనులు జరిగి జిల్లా అభివృద్ధి చెందుతూ వుంటే ఎంతో ఆనందిస్తానని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో శుక్రవారం పంచాయితీ పన్నులు, శానిటేషన్, బయోమెట్రిక్ తదితర అంశాలపై పంచాయితీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పంచాయితీల్లో శానిటేషన్‌పై సమీక్షిస్తూ ప్రతీ రోజూ ఉదయం 5.30 గంటలకే క్షేత్రస్థాయికి వెళ్లి అధికారులు శానిటేషన్ పనులు నిర్వర్తించాల్సి వుండగా చాలా మంది పట్టించుకోవడం లేదని, తాను ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కొద్ది రోజులు అందరూ పాటించారని, మీరు అలవాటుపడ్డారుకదా ప్రతీ రోజూ కొనసాగిస్తారని భావించానని, కాని ఇప్పుడు ఉదయం వెళ్లి శానిటేషన్‌పై దృష్టి పెట్టకుండా మొత్తం వదిలేశారని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగేనా మీరు ప్రవర్తించేది, ఇలా అయితే ప్రతివారం సమీక్షించడం దేనికి అని ప్రశ్నించడంపై ఒక ఇవో ఆర్‌డి లేచి మీ సమీక్షల వల్ల పనులు వేగవంతమై గ్రామాల్లో స్వర్ణయుగం వచ్చిందని అందరూ అంటున్నారని చెప్పడంపై కలెక్టర్ స్పందిస్తూ తన లక్ష్యం మేర మీరంతా పనిచేస్తూ గ్రామాలను అభివృద్ధి చేయాలని, ఆ అభివృద్ధిని చూసి ఆనందిస్తానేగానీ, ఇటువంటి పొగడ్తలకు తాను సంతోషించనన్నారు. పంచాయితీల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని గ్రామంలోని 200 గృహాలను ఒక యూనిట్‌గా తీసుకుని చెత్తను సేకరించేందుకు అవసరమైన సిబ్బందిని, రిక్షాలను ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. చెత్తను ఏ విధంగా సేకరించి డంపింగ్ యార్డులకు తరలించేది ఒక కార్యాచరణ రూపొందించి తనకు అందజేయాలని జిల్లా పంచాయితీ అధికారి సుధాకర్‌ను కలెక్టర్ ఆదేశించారు. పన్నుల వసూళ్లపై సమీక్షిస్తూ 2016-17 సంవత్సరంలో జిల్లాలో మొత్తం 75 కోట్లు వసూలు చేయాల్సి వుందని, జిల్లాలో ప్రతీ రోజూ కనీసం పది లక్షలైనా వసూలు చేయకుండా రోజుకు నాలుగు లక్షలు మాత్రమే వసూలు చేస్తుంటే ఎలా అని ప్రశ్నించారు. 2016-17కు సంబంధించి డిమాండ్ నోటీసులు వచ్చే వారానికి నూరుశాతం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. బయోమెట్రిక్ అటెండెన్స్‌పై సమీక్షిస్తూ ప్రతి ఒక్కరూ బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరిగా వేయాల్సిందేనన్నారు. చాలా మంది వారు పనిచేసే ప్రాంతాలలో నివాసం ఉండకుండా దూర ప్రాంతాల నుంచి విధులకు హాజరవుతున్నారన్నారు. అలా అయితే పనులు ఎలా జరుగుతాయని ప్రశ్నించారు. ఏలూరు రైల్వే స్టేషన్ దగ్గరలో వున్న వైద్య ఆరోగ్య శాఖ, ఇరిగేషన్ కార్యాలయాలలో ఇతర కార్యాలయాల సిబ్బంది ఎక్కువగా బయోమెట్రిక్ హాజరు వేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందని, దీనిని బట్టి ఏలూరులోనే చాలా మంది ఉద్యోగులు నిసం ఉంటూ ఇతర ప్రాంతాలకు విధులకు హాజరుకావడం, కొంతమంది హాజరువేసి విధులకు వెళ్లకపోవడం కూడా తన దృష్టికి వచ్చిందన్నారు. తన పరిశీలనలో అటువంటి వారిని గుర్తిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలోని అన్ని పంచాయితీ కార్యాలయాల్లో ఇంటర్నెట్ ఏర్పాటు చేసి అన్ని పౌర సేవలు ఆన్‌లైన్ ద్వారా అందిస్తూ పంచాయితీ కార్యాలయాలను మినీ మీ-సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దాలని పంచాయితీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో డిపివో కె సుధాకర్, డివిజనల్ పంచాయితీ అదికారులు రాజ్యలక్ష్మి, అమ్మాజీ, సూర్యనారాయణ, శ్రీరాములు, ఇవో ఆర్‌డిలు పాల్గొన్నారు.