పశ్చిమగోదావరి

గోదావరిలో మట్టి తొలగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిడదవోలు, నవంబర్ 4: ప్రతి ఏడాది గోదావరికి వరద ఉద్ధృతి తగ్గిన తరువాత విజ్జేశ్వరం హెడ్ స్లూరుూస్ పక్కన నిర్మించిన సక్కర్ స్లూరుూస్ ఆపరేషన్ ద్వారా నదిలో చేరిన మట్టిన సముద్రంలోకి వదిలేస్తారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు గేట్లు ఎత్తివేసి పేరుకుపోయిన మట్టిని సముద్రంలోకి వదిలేశారు. గోదావరి మట్టి పోయే విధంగా సర్ ఆర్దర్ కాటన్ సక్కల్ స్లూరుూస్ నిర్మించినట్టు హెడ్ వర్క్స్ ఎస్‌ఇ ఎన్ కృష్ణారావు తెలిపారు. ప్రతి ఏడాది నవంబర్‌లో గేట్లు ఎత్తి మట్టి సముద్రంలోకి వదిలేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిఇఇ టి శ్రీనివాస్, ఎఇలు డి రాధాకృష్ణ, అద్దంకి సాయిరాం, పి విజయసుందర్, లాక్ సూపరింటెండెంటు గోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.