పశ్చిమగోదావరి

జిల్లాలో రక్తపుటేర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఏప్రిల్ 4: పశ్చిమగోదావరి జిల్లా ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుందనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమవుతుంటుంది. కానీ ఒక్కసారిగా జిల్లావాతావరణంలో పెనుమార్పు సంభవించినట్లు కన్పిస్తోంది. మూడు రోజుల్లో రెండు దారుణహత్యలు చోటుచేసుకోవటం జిల్లాలో తీవ్ర సంచలనాన్ని సృష్టించింది. పట్టపగలే అత్యంత కిరాతకంగా ఈ హత్యలు జరగటం గమనార్హం. వివరాల్లోకి వెళితే... కొవ్వూరులో ఈ నెల 1న కౌన్సిలర్ పాకా గోపాలకృష్ణ పట్టపగలే దారుణహత్యకు గురైన విషయం తెల్సిందే. పట్టపగలు బైక్‌పై వెళుతున్న ఆయనను నడిరోడ్డుపై కత్తులతో దాడిచేసి హత్యచేశారు. తాజాపరిణామాల్లో సోమవారం జిల్లా కేంద్రం ఏలూరులో పట్టపగలే మిట్టమధ్యాహ్నం న్యాయవాది పలివెల దత్తాత్రేయ రామానంద రాయల్(45) దారుణ హత్యకు గురయ్యరు. ఆయనను కూడా ప్రత్యర్ధులు రంపంలాంటి కత్తులతో దాడి చేసి కిరాతకంగా హత్య చేశారు. వరుసగా మూడు రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న ఈ రెండు హత్యాఘటనలు పోలీసుల సామర్ధ్యంపై ప్రశ్నార్ధకాలను లేవనెత్తుతుండగా, మరోవైపు ప్రశాంత పశ్చిమను ఈ ఘటనలు కుదిపేశాయనే చెప్పాలి.
సోమవారం ఘటనను పరిశీలిస్తే న్యాయవాది రాయల్ చాలాకాలంగా ఏలూరు పరిధిలోని పలు వ్యవహారాల్లో క్రియాశీలకంగా ఉంటూ వచ్చారు. రాజకీయంగా ఎటువంటి ప్రమేయం లేకపోయినా పోలీసుస్టేషన్లలో రాజీ వ్యవహారాలు, ప్రైవేటు వివాదాల పరిష్కారాలు వంటివే ప్రత్యర్ధులను హత్యకు పురిగొల్పాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏలూరులోని గాంధీస్కూల్ పక్కన ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లోని ఒక దుకాణంలో సోమవారం ఉదయం 12గంటల సమయంలో న్యాయవాది రాయల్ కూర్చుని ఉండగా, నలుగురు వ్యక్తులు వచ్చి ఎసి రిపేర్ చేస్తారా అంటూ షాపు యజమాని సోదరుడు నరహరి భాస్కర్‌ను ప్రశ్నించారు. అయితే ఎసిలు బాగుచేయమని ఆయన చెప్పినవెంటనే ఒక్కసారిగా ఆ నలుగురు వ్యక్తులు షాపులోకి చొరబడి షట్టరు దించేశారు. అనంతరం భాస్కర్‌ను బెదిరించి పక్కన ఉండాలని చెప్పి, ఇద్దరు వ్యక్తులు రంపంలాంటి కత్తులతో ఒక్కసారిగా రాయల్‌పై దాడిచేశారు. చివర్లో కొన ఊపిరితో ఉన్నాడన్న అనుమానంతో రాడ్‌తో తలపై కొట్టారు. దీనితో రాయల్ అక్కడికక్కడే మృతిచెందారు. అనంతరం షట్టర్ తీసుకుని ముగ్గురు వ్యక్తులు బయటకువచ్చి పరారయ్యారు. అయితే భాస్కర్ బయటకు వచ్చిన తర్వాత షట్టరు వేసేయటంతో నిందితుల్లో ఒకరైన గురిజాల నవీన్ మురళీ అనే వ్యక్తి షాపులో ఉండిపోయాడు. ఈలోగా చుట్టుపక్కల షాపుల యజమానులు కూడా అక్కడకు చేరుకుని పోలీసులకు సమాచారం అందించారు. వెనువెంటనే వారు ఘటనాస్థలానికి చేరుకుని షాపులో ఉండిపోయిన నవీన్‌మురళీని అదుపులోకి తీసుకున్నారు. రాయల్ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ భాస్కర్‌భూషణ్ ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి షాపు యజమాని సోదరుడు భాస్కర్‌ను అడిగి సంఘటనా వివరాలు తెలుసుకున్నారు. కాగా రాయల్‌కు భార్య బాలాత్రిపురసుందరి, ఆరుసంవత్సరాల కుమారుడు హర్షవర్దన్ రాయల్ ఉన్నారు.
మొత్తంమీద కొవ్వూరు, ఏలూరులో జరిగిన దారుణహత్యలను పరిశీలిస్తే ఈ రెండు పట్టపగలే నిర్భయంగా ప్రత్యర్ధులు దాడులకు పాల్పడి రెండు హత్యలకు కారణమయ్యారు. ఈ ఇద్దరు కూడా అయా ప్రాంతాల్లో పేరున్న వ్యక్తులే కావటం, కొంత వివాదాస్పద నేపథ్యం ఉండటం కూడా గమనార్హం. గతంలో జిల్లాలోని పలు ప్రాంతాల్లో రౌడీషీటర్ల బెడద ఎక్కువగా ఉండేది. ఏలూరుతోపాటు తాడేపల్లిగూడెం, భీమవరం తదితర ప్రాంతాల్లో హత్యలు జరిగిన సంఘటనలు కూడా ఉన్నాయి. అయితే తదనంతర పరిస్ధితుల్లో గత కొనే్నళ్లుగా పశ్చిమ ప్రశాంతంగానే ఉందని చెప్పవచ్చు. తిరిగి ఇనే్నళ్లకు మరోసారి హత్యల పరంపర ప్రారంభం కావటం జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది.