పశ్చిమగోదావరి

మా భూములు ఏమయ్యాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేలేరుపాడు, నవంబర్ 8: సుమారు 60-70 సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న తమ భూములకు పరిహారం ఇచ్చేటప్పుడు సగం సగం ఇవ్వడంలో ఆంతర్యమేమిటని, మిగిలిన భూములేమైనట్లని అవార్డు విచారణలో అధికారులను రేపాకగొమ్ము కాల్సా రైతాంగం ప్రశ్నించింది. వివరాలిలా ఉన్నాయి. పోలవరం భూ సేకరణకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం రెండు దఫాలు పేపర్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ముందుగా విడుదల చేసిన నోటిఫికేషన్లో తమ భూములు ఉన్నవి ఉన్నట్లుగా ప్రకటించిందని, తదుపరి విడుదల చేసిన రూఢి ప్రకటనలో 1940లోని రికార్డు (చేతివారి) ప్రకారం సర్వే నెంబర్లతోపాటు భూమినే తగ్గించి వేయడం తమని అయోమయానికి గురిచేసిందని రైతాంగం వాపోతోంది. ఈ విధంగా కొందరు రైతులకు సంబంధించిన భూములు విస్తీర్ణం తగ్గించి, మరో కొందరి రైతుల్లో పెంచి చూపించారని, ఈ విషయాన్ని సాక్షాత్తూ సబ్ కలెక్టర్, భూ సేకరణ ప్రత్యేకాధికారి షణ్మోహన్ దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై అధికారులు రీ సర్వే నిర్వహించి వాస్తవంగా భూములు ఉన్న రైతులకు సర్వే ప్రకారం పరిహారం అందిస్తామన్నారు. అటువంటి తేడాలపై భయపడాల్సిన పనిలేదని హామీ ఇచ్చారని చెప్పారు. ఈ హామీ మేరకు తామంతా సంతృప్తిగా ఉన్నామన్నారు. కానీ మంగళవారం నిర్వహించిన అవార్డు విచారణలో తప్పుల తడకలుగా వచ్చిన రూఢీ ప్రకటన ప్రకారం అవార్డు పాస్ చేయడం తమను అయోమయానికి గురిచేసిందన్నారు. ఈ విధంగా రేపాకగుమ్ము గ్రామానికి చెందిన కంపెల వెంకట నర్సయ్య, గుండారపు నీలయ్య, చలకోటి బాబూరావు తదితర రైతులకు ఉన్న భూములు ఎకరం నుండి ఎకరంన్నర తగ్గించారని, ఈ భూములు మరొకరికి పెంచి ఇచ్చారన్నారు. కంపెల వెంకట నర్సయ్య అనే రైతు తమకున్న రెండెకరాల్లో ముగ్గురు అన్నదమ్ములు పంచుకోవాల్సి వచ్చిందని, దానిలో ఎకరం భూమి లేనట్లు అవార్డు పాస్ చేయడంతో తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని వాపోయారు. ఇదే విధంగా మిగిలిన రైతులు సైతం ఎన్నో ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూమికి భూమి ఉందని, రికార్డుల్లో సైతం అన్ని విధాలా హక్కులు కల్గి ఉన్నప్పటికీ ఏదో చేత్వారీ అని తమకు తగ్గించి ఇవ్వడం సబబు కాదన్నారు. ఈ విషయమై సంబంధిత ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి తమ భూములకు రికార్డుల ప్రకారం వాస్తవంగా ముందు ప్రకటించిన నోటిఫికేషన్ ద్వారా పరిహారం అందించాలని ముక్తకంఠంతో కోరుతున్నారు.