వరంగల్

దళితుల సంక్షేమానికి 10వేల 800కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఏప్రిల్ 5: దళితుల కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలు లబ్ధిపొందడమే కాక మన హక్కులను సాధించుకునేందుకు ఐక్యంగా ఉండాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. మంగళవారం అంబేద్కర్ భవన్‌లో జరిగిన బాబుజగ్జీవన్‌రామ్ 109వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం దళితులకు మూడెకరాల భూమి ఇస్తూ ఒక సంవత్సరం పాటు దానిని సాగుకు యోగ్యంగా మలిచేందుకు చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ సంతవ్సరం భూమి కొనుగోలు పథకం కింద 2వేల ఎకరాల పంపిణీ లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. దళితుల అభివృద్ధి సంక్షేమానికి ఈ సారి 10వేల 800 కోట్లు కేటాయించామన్నారు. వీటిని ఎస్సీ సబ్‌ప్లాన్ ద్వారా వినియోగించుకునేందుకు మార్గదర్శకాలు త్వరలో వెలువడనున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల వర్గీకరణకు కట్టుబడి ఉండబట్టే మొదటిసారే శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపడం జరిగిందన్నారు. ఈసారి పార్లమెంటు సమావేశాలు జరిగే ముందు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. దళితులకు జిల్లాలో వేదిక లేకపోవడం వలన తాను గతంలో మంత్రిగా ఉన్న సమయంలో ఒక సంవత్సర కాలంలోనే అంబేద్కర్ భవనాన్ని నిర్మించడం జరిగిందన్నారు. ఈ భవనానికి అవసరమైన మరమ్మతులను చేపట్టాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. నగర మేయర్ సూచన మేరకు డాక్టర్ బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని కార్పొరేషన్ ఎంపిక చేసిన స్థలంలో సంవత్సరకాలంలో ప్రతిష్టించడం జరుగుతుందన్నారు. తెలివి తేటలు ఎవరి సొత్తు కాదని, అవకాశం వస్తే అందిపుచ్చుకునే తెలివితేటలు దళితుల్లో ఉన్నాయన్నారు. గురుకుల పాఠశాల విద్యార్థులు హిమాలయాన్ని అధిరోహించిన సంఘటనను గుర్తు చేశారు. రిజర్వేషన్ల వలన ఉన్నత స్థాయికి ఎదిగిన వ్యక్తులు తమ వర్గం వారికి ఎదగడంలా అవకాశాలు చూపిస్తూ అవగాహన కల్పించాలని దానికి గురుకుల పాఠశాలల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ మంచి ఉదాహరణ అని అన్నారు. పోలీసు శాఖలో ఐజి స్థాయి వ్యక్తి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ సెక్రటరీగా ఇష్టంతో పని చేస్తూ, దళిత విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీస్తున్నారని అన్నారు. అలాగే ప్రేమ్‌జీ ఫౌండేషన్ దేశ వ్యాప్తంగా 2వేల మందికి స్కాలర్‌షిప్స్ మంజూరి చేయగా అందుకు గాను మన రాష్ట్రానికి కేటాయించిన 50 స్కాలర్‌షిప్స్‌కు జరిగిన అర్హత పరీక్షలో ఎంపికైన వారు 36 మంది దళితులేనని మంత్రి వివరించారు. వసతి గృహ విద్యార్థులకు సన్నబియ్యంతో ఆహారం అందిస్తోందన్నారు. మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు సీతారాంనాయక్ మాట్లాడుతూ త్వరలో 5వేలకు పైగా ఉన్న తండాలు 1756 గ్రామపంచాయతీలుగా మారనున్నాయన్నారు. బడుగు బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెలిపారు. వరంగల్ ఎంపి పసునూరి దయాకర్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్‌రామ్ కుల వివక్షకు గురైన వ్యక్తి అని అలాంటి వ్యక్తి 40 సంవత్సరాలు పార్లమెంటు సభ్యుడిగా, 30 సంవత్సరాలు మంత్రిగా పని చేశారన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ బాబుజగ్జీవన్‌రామ్ విగ్రహాన్ని కలెక్టర్ కార్యాలయ ఎదుట గల స్థలంలో ఏర్పాటు చేయాలని కోరారు. మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నన్నపనేని నరందర్ మాట్లాడుతూ మనం ఎదిగి మన వారిని కూడా ఎదిగేలా చేయాలని, అప్పుడే అంబేద్కర్, బాబు జగ్జీవన్‌రామ్ చేసిన పనులు అందరికి లాభించగలవని అన్నారు. ఈ సమావేశానికి ముందు సాంస్కృతిక సారధి కళాకారులు ఆటాపాటలతో ఆహుతులను అలరించారు. అనంతరం జ్యోతిప్రజ్వాలన గావించి బాబుజగ్జీవన్‌రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ వాకాటి కరుణ, సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు, ఎస్పీ అంబర్‌కిషోర్‌ఝా, జిల్లా రెవెన్యూ అధికారి శోభ, ఏజెసి తిరుపతిరావు, దళితరత్న బొమ్మల కట్టయ్య, మందకుమార్, విష్ణుమూర్తి, జోరిక రమేష్, సమాచార ఉపసంచాలకులు డి.ఎస్.జగన్ తదితరులు పాల్గొన్నారు.