పశ్చిమగోదావరి

ఆర్థిక వ్యవస్థ బలోపేతానికే పెద్దనోట్ల రద్దు: ఎంపి మాగంటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 14: నల్లకుబేరుల బండారాన్ని బయటపెట్టి దేశ ఆర్ధికవ్యవస్ధను బలోపేతం చేయడానికే ప్రధాని నరేంద్రమోది పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని తీసుకున్నారని ఏలూరు ఎంపి మాగంటి బాబు చెప్పారు. స్దానిక స్టేట్‌బ్యాంక్ మెయిన్‌బ్రాంచిలో సోమవారం ఆయన క్యూలో నిలబడి పాత 500 నోట్లను మార్చుకున్నారు. ఈసందర్భంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను మాగంటి బాబు అడిగి తెలుసుకున్నారు. తాత్కాలికంగా కొద్దిరోజులు ప్రజలు ఇబ్బందులు పడ్డా దేశానికి ఉపయోగపడే కీలకనిర్ణయం ప్రధాని తీసుకున్నారన్నారు. దేశంలో ప్రస్తుతం ఒక 500 రూపాయల నోటుకు 109 దొంగనోట్లు చలామణిలోకి వచ్చాయని, అదే వెయ్యి రూపాయల నోటుకు 89 దొంగనోట్లు చలామణిలో ఉన్నాయని, అటువంటివాటిని సమూలంగా అరికట్టాలనే ఉద్దేశ్యంతోనే ఈనిర్ణయం తీసుకోవటం జరిగింది తప్ప ఇందులో ప్రజలను ఇబ్బంది పెట్టాలనే ఆలోచన ప్రధానికి లేదన్నారు. ఏడాదిపాటు సుదీర్ఘ కసరత్తు అనంతరమే ప్రధాని పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారే తప్ప రాత్రికిరాత్రి తొందరపాటుగా నిర్ణయం చేయలేదన్నారు. రాబోయే కొద్దినెలల్లో మరో మూడు కీలకమైన నిర్ణయాలు తీసుకుని నల్లకుబేరుల బండారాన్ని ప్రధాని బట్టబయలు చేయనున్నారని, ఆరునెలల తర్వాత భూముల ధరలు బాగా తగ్గిపోతాయని, అవినీతి కూడా అంతం అవుతుందని మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. కొద్దిసేపు క్యాషియర్ అవతారం ఎత్తిన మాగంటి బాబు ఒక మనిషికి కౌంటర్ వద్ద ఎంతసమయం పడుతుందో అంచనా వేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, మాగంటి రామ్‌జీ, బ్యాంక్ సీనియర్ అధికారులు ప్రసాద్, కె జగదీశ్వరరావు, కిశోర్‌కుమార్‌రెడ్డి తదితరులు ఉన్నారు.