పశ్చిమగోదావరి

తేమ ఎంత ఉన్నా కొంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెందులూరు, ఏప్రిల్ 5: రైతులు పండించిన ధాన్యం తేమ శాతం ఎలా వున్నా గానీ కొనుగోలు చేసి రైతులను ఆదుకుంటామని, రైతులు ఇబ్బంది పడకూడదనే లక్ష్యంతో నామమాత్రంగా తేమశాతాన్ని ఏర్పాటుచేశామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం కొవ్వలి సొసైటీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఎలక్ట్రానిక్ మిషనరీపై ధాన్యం తేమ శాతాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం రైతు సంక్షేమ ప్రభుత్వమని, వినియోగించుకోవాల్సిన బాధ్యత రైతులపైనే వుందని, కావాల్సిన సౌకర్యాలు సమకూరుస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, గ్రామ కార్యదర్శి మేకా శ్రీనివాస్, సహకార సంఘ సిబ్బంది, తహశీల్దార్ నజీముల్లాషా, ఎంపిడివో అప్పారావు తదితరులు పాల్గొన్నారు.
రైతుకు గిట్టుబాటు ధర లక్ష్యం
రైతులు దళారీల బారిన పడకుండా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలుకు అనేక కేంద్రాలను ఏర్పాటు చేశామని, రైతులంతా కూడా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో విక్రయించుకుని మద్దతు ధర పొందాలని రాష్ట్ర మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. మంగళవారం కొవ్వలి గ్రామంలోని చైతన్య కొవ్వలి గ్రామ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి పుల్లారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సంఘ ప్రతినిధులు ప్రతీ రైతుకు సమాచారాన్ని అందించి వారు కేవలం ఐకెపి కేంద్రాలకే తాము పండించిన ధాన్యాన్ని విక్రయించుకునేలా తోడ్పడాలని పేర్కొన్నారు.
ఐకెపి కేంద్రాలకు ధాన్యం విక్రయించిన 24 గంటల్లోనే వారి బ్యాంకు అకౌంట్లకు డబ్బు జమ చేస్తారని, ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట మంత్రి కామినేని శ్రీనివాస్, దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, దెందులూరు ఎంపిడివో ఎంవి అప్పారావు, తహశీల్దార్ ఎండి నజీముల్లాషా, గ్రామ కార్యదర్శి మేకా శ్రీనివాస్ పాల్గొన్నారు.