పశ్చిమగోదావరి

హర..హర మహాదేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, నవంబర్ 14: హరహర మహాదేవ శంభో శంకరా... అంటూ శివ నామ స్మరణతో పంచారామక్షేత్రాలు మారుమోగాయి. కార్తీకమాసం సోమవారం అందులో కార్తీక పౌర్ణమి ఒకేరోజు రావడంతో పంచారామక్షేత్రంలో భీమవరంలో ఒకటైన భీమవరం శ్రీఉమా సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్ధానంలో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఈఓ నల్లూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలో ఆలయ అర్చకులు కందుకూరి సోంబాబు, చెరుకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో మహిళలు దోషాలు తొలగిపోవాలంటూ అభిషేక పూజలు నిర్వహించుకున్నారు. ద్వజస్తంభం వద్ద దీపాలను వెలిగించారు. స్వామివారిని దర్శించుకునేందుకు ఆర్టీసీ ప్రత్యేకంగా పంచారామక్షేత్ర బస్సులను ఏర్పాటు చేసింది. సుమారు 100 బస్సుల్లో భక్తులు తరలివచ్చారు. వన్‌టౌన్ సిఐ దేశంశెట్టి వెంకటేశ్వరరావు ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడంతో ఎటువంటి ఆవాంచనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. పలువురు దాతలు భక్తులకు ప్రసాదాలను అందించారు.