పశ్చిమగోదావరి

కాపు నాయకులకే సిఎం పీఠం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, నవంబర్ 18: కాపులంతా ఐక్యంగా ఉంటే సిఎం పీఠం కాపు నాయకులకే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా కుమారుడు రాధాకృష్ణ పేర్కొన్నారు. దేవరపల్లి మండలం యాదవోలులో శుక్రవారం రంగా, శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాలను ఆవిష్కరణ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ, డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత అధిక జనాభా ఉన్న కాపు సామాజిక వర్గీయులెవరూ సిఎం కాలేదని, రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో రాష్ట్రంలో కాపుల సంఖ్య మరింత పెరిగిందన్నారు. కాపు సామాజిక వర్గీయులంతా ఏకతాటిపై ఉంటే భవిష్యత్తులో కాపునేతే సిఎం కావడం తథ్యమని చెప్పారు. కాపు యువత చైతన్యవంతులు కావాలని వారు పిలుపునిచ్చారు. అంతకు ముందు యాదవోలు గ్రామానికి వచ్చిన వంగవీటి రాధాకృష్ణ, కరాటం రాంబాబులకు కాపు యువత అఖండ స్వాగతం పలికారు. యాదవోలు గ్రామ వీధుల్లో పెద్ద ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించారు. కృష్ణదేవరాయలు విగ్రహాన్ని యాదవోలుకు చెందిన అనిశెట్టి సర్వారాయుడు ఏర్పాటుచేయగా కరాటం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అలాగే గ్రామ కాపు సంఘం ఏర్పాటుచేసిన వంగవీటి మోహనరంగా విగ్రహాన్ని ఆయన తనయుడు రాధాకృష్ణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కాపు సామాజిక వర్గీయుల ఆధ్వర్యంలో భారీ కార్తీక వన సమారాధన నిర్వహించారు. కార్యక్రమంలో యాదవోలు కాపు సామాజిక వర్గీయులతోపాటు గోపాలపురం, కొవ్వూరు నియోజకవర్గాల నుండి విశేష సంఖ్యలో కాపు సామాజిక వర్గీయులు పాల్గొన్నారు.