పశ్చిమగోదావరి

నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలి: కలెక్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 18 : జిల్లాలో చిల్లర నగదు సమస్యను అధిగమించేందుకు నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని, ఈ దిశగా వ్యాపారస్తులు ఈ-పోస్ యంత్రాలను ఏర్పాటుచేసుకునేలా సర్వే పనులను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ అధికారులను ఆదేశించారు. నగదు రహిత లావాదేవీలు ఈ-పోస్ యంత్రాల ఏర్పాట్ల సర్వే పనులపై తహశీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ట్రేడ్ లైసెన్స్ కలిగి చట్టబద్ధమైన వాణిజ్య కార్యక్రమాలు నిర్వహించే ప్రతీ దుకాణంలోనూ ఈ-పోస్ యంత్రాలు ఉచితంగా ఏర్పాటు చేసేందుకు జిల్లాలోని బ్యాంకర్లు ముందుకు వస్తున్నారని, నెలవారీ అద్దె మినహాయింపునకు కూడా వీలుంటుందన్నారు. యంత్రాల ఏర్పాట్లపై సర్వే నిమిత్తం గ్రామ, మున్సిపల్ వార్డు స్థాయిలలో బృందాలను వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకోసం బ్యాంకులు, ఎటి ఎంల వద్ద నియమించిన సిబ్బంది సేవలు వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ బృందంలో కనీసం ఇద్దరు సభ్యులుగా ఉండేలా చూడాలని, ఈ బృందాలను సమన్వయపరిచేందుకు గ్రామ, మున్సిపల్ స్థాయిలలో కమాండ్ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. రెవిన్యూ డివిజన్ స్థాయిలో ఆర్‌డివో, సబ్ కలెక్టర్లు ఆధ్వర్యంలో ఈ బృందాలు పనిచేస్తాయని, కమాండ్ కంట్రోల్ రూమ్‌లలోని సమాచారం ద్వారా సంబంధిత ఆర్‌డివోలు, సబ్-కలెక్టర్లు ఎప్పటికప్పుడు అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సర్వే బృందాలు చిన్నా, పెద్దా తేడా లేకుండా ప్రతీ దుకాణాదారుడు వద్దకు వెళ్లి ఈ-పోస్ యంత్రాల వినియోగం ద్వారా కలిగే ప్రయోజనాలు, వ్యాపారాభివృద్ధికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించి వాటిపై అవగాహన కలిగించి ఈ-పోస్ యంత్రాలు ఏర్పాటుకు అంగీకరింపచేసేలా బృందాలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-పోస్ యంత్రం ఏర్పాటు, షాపు యజమానితో బ్యాంకులో కరెంటు అకౌంట్ ప్రారంభించడం, కరెంటు అక్కౌంట్‌తో ఈ-పోస్ యంత్రాలను అనుసంధానించి, యంత్రం పనితీరు, నగదు బదిలీ, తదితర అంశాలపై షాపు యజమానులకు పూర్తిస్థాయిలో అవగాహన కలిగించాల్సిన బాధ్యత సర్బే బృందాల సభ్యులపై వుందన్నారు. సర్వే బృందాలలోని సభ్యులను డివిజన్‌స్థాయిలో ఈ నెల 19వ తేదీ శనివారం నుండి సర్వేపై శిణా తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అమ్మకం సామర్ధ్యాన్ని అనుసరించి పెద్ద సంఖ్యలు పెద్ద ఈ-పోస్ యంత్రాలు, చిన్న వ్యాపార సంస్థలు చిన్న ఈ-పోస్ యంత్రాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కలిగించాలన్నారు.
సర్వే బృందాలు ముందుగా వాణిజ్య ప్రాంతాలలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. అంతేకాక డెబిట్, క్రెడిట్, రూపే కార్డు, ఈ-పోస్, స్వైపింగ్ యంత్రాలు లేకపోయినా ఎంపి ఐ (యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్) విధానంతో స్మార్ట్ ఫోన్ ద్వారా నగదు రహిత చెల్లింపులు చేయవచ్చని, యుపి ఐ యాప్‌ను దుకాణ యజమానుల స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసి, ఈ విధానంపై అవగాహన చేయాలన్నారు. సమావేశంలో ఏలూరు నగర పాలక సంస్థ కమిషనర్ వై సాయి శ్రీకాంత్, తాడేపల్లిగూడెం మున్సిపల్ కమిషనరు నిమ్మగడ్డ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
మట్టి లారీలను అడ్డుకున్న రైతులు
పోలవరం, నవంబర్ 18: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తీస్తున్న మట్టిని శుక్రవారం సాయంత్రం రైతులకు సంబంధించిన భూముల్లో వేస్తుండడంతో రైతులు మట్టిని వేస్తున్న లారీలను అడ్డుకున్నారు. మూల్లంకకు చెందిన భూములు డింపింగ్‌యార్డు నిమిత్తం ప్రభుత్వానికి రైతులు ఇవ్వకపోవడంతో ఆ భూములకు సరిహద్దుల్లో ఉన్న ప్రభుత్వ భూముల్లో మూడు రోజులుగా మట్టిని డంప్ చేస్తున్న విషయం విదితమే. ప్రభుత్వ భూములకు పక్కనే చిలకా చాముండేశ్వరి, పాముల దుర్గకు చెందిన భూముల్లో మట్టిని భారీగా డంప్ చేశారు. విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి చేరుకుని లారీలను నిలిపివేశారు. దాంతో లారీ డ్రైవర్లు పనులు నిలిపివేసి 1986లూ రైతుల నుండి ప్రభుత్వం సేకరించిన 5.5 ఎకరాల్లో మట్టిని డంపింగ్ చేయడం ప్రారంభించారు. రైతులు కోటం రాంబాబు, నంగినీడి కృష్ణ, బండి అంజయ్య తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ తమ భూముల్లో తమ అంగీకారం లేకుండా దౌర్జన్యంగా స్వాధీనం చేసుకుంటారేమోననే ఆందోళనకు గురవుతున్నామన్నారు. అధికారులు అన్ని విధాల ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు.