పశ్చిమగోదావరి

9న అమరావతిలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ కార్యాలయం ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, డిసెంబర్ 1: నూతన రాజధాని అమరావతిలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ రాష్ట్ర కార్యాలయం ఈనెల 9న ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు గురువారం మంత్రి పైడికొండల మాణిక్యాలరావును కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి ఈనెల 9న రాష్ట్ర కార్యాలయాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. దేవాదాయ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ ఎస్ సుబ్బారావు, సహాయ కమిషనర్లు ఎం రత్నం, ఎన్ విజయరాజు, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డి కృపావరం, బవిరి రవి తదితరులు పాల్గొన్నారు.
అక్రమంగా తరలిస్తున్న గోవుల పట్టివేత
జంగారెడ్డిగూడెం, డిసెంబర్ 1: గోవులు, ఎద్దులను వధశాలకు హైదరాబాద్ అక్రమంగా తరలిస్తున్న ఐషర్ వ్యాన్‌ను స్థానిక బైపాస్ రోడ్డులో ఎస్సై ఎం.కేశవరావు ఆధ్వర్యంలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విఆర్‌ఒ పి.రవికుమార్ ఫిర్యాదు మేరకు ఐషర్ వ్యాన్ డ్రైవర్ ఇక్కల గోపాలకృష్ణను అరెస్టుచేసి, వ్యాన్, 15 గోవులు, ఎద్దులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న పశువులను కాకినాడ గోశాలకు తరలించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం నుండి హైదరాబాద్‌లోని హయత్‌నగర్‌లోని గోవధ శాలకు గోవులు, ఎద్దులను తరలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్టయిన డ్రైవర్ గోపాలకృష్ణ హైదరాబాద్‌కు చెందినవాడని, అతన్ని రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు.

ఖోఖో జట్టు రాష్ట్రానికి వనె్న తేవాలి
ఏలూరు, డిసెంబర్ 1 : ఖోఖో పోటీలలో గెలుపొంది రాష్ట్రానికి వనె్న తీసుకురావాలని ఆర్మీ రిజర్వ్‌డ్ డి ఎస్‌పి కె వెంకటరావు కోరారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో రాష్ట్ర ఖోఖో జట్టు క్రీడాకారుల ఎంపిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్రం తరఫున 12 మంది క్రీడాకారులను ఎంపిక చేశారని, డిసెంబరు 2, 3, 4 తేదీల్లో కర్ణాటకలోని గుల్బర్గాలో జరిగే ఆరు రాష్ట్రాల జట్ల పోటీల్లో మన జట్టు విజయపతాకం ఎగురవేయాలని ఆకాంక్షించారు. గ్రామీణ ప్రాంతాలలో ఖోఖో క్రీడకు ఎంతో ప్రాముఖ్యత ఉన్నదని, ఎంతో మంది ఖోఖోలో మన జిల్లా క్రీడాకారులు జాతీయ స్థాయిలో బహుమతులు సాధించి మంచి పేరు సంపాదించారని అదే విధంగా దక్షిణాధి రాష్ట్రాల్లో జరుగుతున్న ఈ క్రీడాపోటీల్లో విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని ప్రపంచానికి చాటాలని కోరారు. కార్పొరేటర్ బండారు కిరణ్‌కుమార్ మాట్లాడుతూ ్ర ఇక్కడ శిక్షణ ందిన క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించారన్నారు. కేరళ, తమిళనాడు, పాండిచ్చేరి, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన సీనియర్ సౌత్ జోన్ ఖోఖో క్రీడాకారులు ఈ పోటీలలో తమ సత్తా చాటనున్నారని కోచ్ పి నరసింహారెడ్డి చెప్పారు. రాష్టస్థ్రాయి ఖోఖో జట్టుకు మంచి శిక్షణ అందించామని సౌత్ జోన్ ఖోఖో విజేతగా మన జట్టు విజయపతాకం ఎగురవేయగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇండోర్ స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యనారాయణమూర్తి, శాప్ అధికారి కొండలరావు, పోలీసు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు, క్రీడాకారుడు సంజయ్ పాల్గొన్నారు.