పశ్చిమగోదావరి

పింఛను కోసం బ్యాంకుకు వెళ్లి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, డిసెంబర్ 2: పింఛను డబ్బుల కోసం బ్యాంకుకు వెళ్లిన ఒక వృద్ధురాలు స్పృహతప్పి పడిపోయిన ఘటన శుక్రవారం కొవ్వూరు మండలం ధర్మవరం ఆంధ్రాబ్యాంకు వద్ద చోటుచేసుకుంది. వివరాలు ఇలావున్నాయి. పింఛను సొమ్ము తీసుకునేందుకు వెళ్లిన ధర్మవరం గ్రామానికి చెందిన కె సూర్యాకాంతం ఎక్కువసేపు క్యూలో నిలబడి ఉండటంతో సొమ్మసిల్లి పడిపోయింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆమెకు సపర్యలు చేసి ఇంటికి తీసుకెళ్లారు. బ్యాంకుల్లో అందుబాటులో డబ్బు లేకపోవడంతో పింఛనుకోసం వచ్చిన వృద్ధులు సాయంత్రం వరకు కౌంటర్ల వద్ద పడిగాపులు పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
మేనేజర్ తీరుకు నిరసనగా ఖాతాదార్ల రాస్తారోకో
నల్లజర్ల, డిసెంబర్ 2: నగదు కోసం బ్యాంకుకు వెళ్లిన ఖాతాదారుల పట్ల అనంతపల్లి ఆంధ్రాబ్యాంకు మేనేజర్ హేళనగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఖాతాదారులు ఆంధ్రాబ్యాంకు ఎదుట గుండుగొలను-కొవ్వూరు జాతీయ రహదారిపై శుక్రవారం రాస్తారోకో నిర్వహించారు. నిత్యావసరాలు కొనుగోలు చేయడానికి తమ చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఇబ్బందులు పడుతున్నామని, తమ బాధ అర్ధం చేసుకోవాలని అనడంతో ‘రోజూ చూసే ముఖాలు ఏం చూస్తాం, వెళ్లండ’ని మేనేజర్ అన్నారని ఖాతాదారులు ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై వెంకటేశ్వరరావు సంఘటనా స్థలానికి చేరుకుని ఖాతాదారులతో చర్చలు జరిపి, అవసరమైతే బ్యాంకు ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ విషయంపై మేనేజర్ శివాజీని వివరణ కోరగా వచ్చిన సొమ్ము వచ్చినట్లు ఖాతాదారులకు చెల్లిస్తున్నామన్నారు. తమ బాధను అర్ధం చేసుకోకుండా ఆందోళనకు దిగారన్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి ఖాతాదారులకు ఇబ్బందులు కలుగకుండా చూస్తామని హామీ ఇచ్చారు.