పశ్చిమగోదావరి

కుల సంఘ సూచన మేరకు రాజకీయ నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరవాసరం, డిసెంబర్ 4: వచ్చే శాసనసభ ఎన్నికల్లో గౌడ శెట్టిబలిజ సంఘీయులు అందరూ తనను ఏ పార్టీలో చేరమంటే ఆ పార్టీలో చేరతానని సినీ హీరో సుమన్ గౌడ్ పేర్కొన్నారు. ఆదివారం వీరవాసరంలో మండల గౌడ, శెట్టిబలిజ ఐక్యవేదిక ఆధ్వర్యంలో వనసమారాధన కార్యక్రమం నిర్వహించారు. సంఘం అధ్యక్షులు చింతపల్లి మాణిక్యాలరావు, కార్యదర్శి కముజు హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ హీరో సుమన్‌ను ఆలిండియా గౌడ, శెట్టిబలిజ సంఘం కార్యదర్శి జక్కంశెట్టి రాజాప్రసాద్ తీసుకువచ్చారు. ఈ సందర్భంగా సుమన్ మాట్లాడుతూ తన సినీ జీవితంతో మర్చిపోలేని సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. మాజీ రాష్టప్రతి చేతులమీదుగా తాను వేంకటేశ్వర స్వామి పాత్రలో నటించిన చిత్రానికి ఘన సన్మానం పొందానన్నారు. సామాజిక వర్గ పరంగా తాను కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాడినైనప్పటికీ తెలుగు, తమిళం, ఇంగ్లీషు తదితర భాషల్లోని అనేక చిత్రాల్లో నటించానన్నారు. గౌడ, శెట్టిబలిజల అభివృద్దికి తన వంతు కృషిచేస్తానన్నారు. ముఖ్యంగా సామాజిక వర్గ ప్రజల కోరికపై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక వర్గీయులు ఎక్కడ నుంచి పోటీ చెయ్యమంటే అక్కడనుంచి పోటీచేస్తానన్నారు. మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ మాట్లాడుతూ ఎవరి సామాజిక వర్గాన్ని వారు అభివృద్ది చేసుకోవడంలో తప్పులేదని, ఇతర సామాజిక వర్గాలకు దూషించకూడదన్నారు. ఎమ్మెల్సీ మేకా శేషుబాబు మాట్లాడుతూ ఆర్ధికంగా వెనుకబడిన అన్ని సామాజికవర్గాలకు ప్రభుత్వాలు మేలుచెయ్యాలన్నారు. గౌడ శెట్టిబలిజ సంఘాల ఐక్యతతోనే అభివృద్దిసాధ్యమన్నారు. ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గౌడ, శెట్టిబలిజకు అన్ని పార్టీలు అభివృద్దికి కలిసి పని చెయ్యాలన్నారు. చింతపల్లి గురుప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణలో అనేక బిసి కులాలను కేసిఆర్ ఒసి జాబితాలో చేర్చారని, మన రాష్ట్రంలో ఒసి కులాలను బిసిల్లో చేర్చడానికి చంద్రబాబు ప్రయత్నంచేస్తున్నారని, దీని వల్ల సామాజిక వర్గం దెబ్బతింటుందన్నారు. అనంతరం సినీ హీరో నటుడు సుమన్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాకా సత్యనారాయణ, వీరవల్లి చంద్రశేఖర్, చింతపల్లి మాణిక్యాలరావు, కముజు హరిబాబు, వీరవల్లి శ్రీనివాసరావు, వీరవల్లి బాస్కరరావు, పాలా ఆంజనేయులు, కవురు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.