పశ్చిమగోదావరి

గ్రామీణులకు ఆధునిక వైద్య సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దెందులూరు, ఏప్రిల్ 5: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన ఆధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తామని, 1900 డాక్టర్ల పోస్టులను నియమిస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. మంగళవారం దెందులూరు నియోజకవర్గంలోని గోపన్నపాలెం, చాటపర్రు, వట్లూరు గ్రామాల్లో నిర్మించిన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలను మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మాతా శిశు మరణాలు ఎక్కువ శాతంలో మనరాష్ట్రంలోనే వున్నాయని, వాటిని నిర్మూలించేందుకు గాను వైద్య ఆరోగ్య సిబ్బందిని అప్రమత్తం చేశామని, విస్తృత ప్రచారం చేస్తున్నామన్నారు. గత ఏడాదిగా తీసుకున్న చర్యల నేపధ్యంలో ఇటీవలే కొద్ది శాతం మరణాల రేటు తగ్గిందని, మరింత తగ్గవల్సిన అవసరం ఎంతైనా వుందని పేర్కొన్నారు. పిహెచ్‌సిలు, ఆరోగ్య ఉప కేంద్రాలు ద్వారా కార్పొరేట్ వైద్య సేవలు పేద ప్రజలకు సైతం అందిస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాల మందులను కూడా సిద్ధం చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి పత్తిపాటి పుల్లారావు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్, గ్రామ కార్యదర్శి కృష్ణంరాజు పాల్గొన్నారు.