పశ్చిమగోదావరి

అత్తిలిలో ఘనంగా షష్ఠి ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అత్తిలి, డిసెంబర్ 5 : అత్తిలిలో శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారి కళ్యాణం అనంతరం ఆదివారం రాత్రి నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అత్తిలి మాజీ ఎమ్మెల్యే చెరకువాడ శ్రీరంగనాథరాజు (రంగరాజు) స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని నాగేంద్రుని విగ్రహానికి భక్తులు పూజలు జరిపారు. ఉన్నత పాఠశాల ప్రాంగణంలో అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. దాస సాహితీ ప్రాజెక్టు వారు నిర్వహించిన కోలాట భజనలు భక్తులు ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తణుకు సిఐ రాంబాబు ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. యాత్రీకులను ఆకట్టుకునేలా జెయింట్ వీల్స్, రంగుల రాట్నాలు ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో దేవతామూర్తుల సెట్టింగులు, డిజిటల్ లైటింగ్‌లు ఆకర్షణీయంగా నిలిచాయి.