పశ్చిమగోదావరి

అంకాలజీ ఫెలోషిప్‌లో నాగవర్మకు మొదటి ర్యాంకు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాలకొల్లు, డిసెంబర్ 20: ఆల్ ఇండియా ఓరల్ సర్జికల్ అంకాలజీ ఫెలోషిప్‌లో పాలకొల్లు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన డివి నరసింహరాజు కుమారుడు హేమంత నాగవర్మ జాతీయ స్థాయిలో ప్రథమంగా నిలిచారు. హెడ్ అండ్ నెక్ వ్యాస్క్యులర్ లీజిన్‌పై ఆయన డాక్టర్ సంజయ్ నాయర్ వద్ద ప్రత్యేకంగా అధ్యయనం చేసినట్లు తెలిపారు. భీమవరం విష్ణు డెంటల్ కళాశాలలో బిడియస్, బెంగళూరు ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్‌లో ఎండియస్ పూర్తి చేశారు. బెంగుళూరు భగవాన్ మహదారజైన్ ఆసుపత్రిలో వైద్య సేవలందిస్తూ వివిధ రంగాల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లామా కోర్సులు కోర్సులు పూర్తి చేశారు. నాగవర్మను స్వచ్చ్భారత్ రాష్ట్ర కన్వీనర్, లయన్స్ గవర్నర్ డాక్టర్ సిహెచ్ సత్యనారాయమూర్తి (బాబ్జి), క్షత్రియ పరిషత్ అధ్యక్షులు కెవి రామకృష్ణంరాజు, కార్యదర్శి డిటిడిసి బాబు, కాస్మో కల్చరల్ స్పోర్ట్సు కాంప్లెక్స్ అధ్యక్షులు చెరుకూరి బుద్దావతారం రాజు, కార్యదర్శి గొట్టుముక్కల గాంధీ భగవాన్‌రాజు, శిడగం పాపారావు, కొల్లు నరసింహమూర్తి తదితరులు అభినందించారు.
చేతి వేళ్లు పెరిగే అరుదైన వ్యాధి

దేవరపల్లి, డిసెంబర్ 20: మండలంలోని సుబ్బరాయపురానికి చెందిన 14 సంవత్సరాల గూడూరి శ్రీనివాస్ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని ఎడమ చేతి రెండు వేళ్లు భారీగా పెరుగుతున్నాయి. చిన్నతనం నుండి ఈ వేళ్లు పెద్ద సైజులో ఉన్నాయి. అయితే గత నాలుగు సంవత్సరాలుగా వేళ్ల పెరుగుదల ఎక్కువైందని శ్రీనివాస్ చెబుతున్నాడు. ఈ బాలుడు ప్రస్తుతం తొమ్మిదవ తరగతి చదువుతున్నాడు. తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నా చేతి వేళ్లు పెరుగుతుండడంతో బాధ, సిగ్గు కలుగుతోందన్నాడు. ఏలూరు ఆశ్రమ ఆసుపత్రికి వెళ్లగా చేతి వేళ్లకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉంటుందని, ఇటువంటి కేసులు చాలా అరుదుగా వస్తుంటాయని అక్కడి వైద్యులు చెప్పారన్నాడు. ఈ శస్త్ర చికిత్సకు ఆరోగ్యశ్రీలో లేకపోవడంతో తాను వైద్యం చేయించుకోలేకపోతున్నానని, దాతలు సహకరిస్తే చికిత్స చేయించుకుంటానని శ్రీనివాస్ చెబుతున్నాడు.
మాజీ ఎంపి మెంటే పద్మనాభంకు తీవ్ర అస్వస్థత

భీమవరం, డిసెంబర్ 20: మాజీ ఎంపీ మెంటే పద్మనాభం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం ఆయనను కుటుంబ సభ్యులు అత్యవసరంగా వర్మ హార్ట్‌కేర్‌లో చేర్పించారు. ఆయన్ని ఐసియులో చేర్చి వైద్యులు వైద్యం అందిస్తున్నారు. పరిస్థితి చాలా సీరియస్‌గా ఉందని వైద్యులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. రైతు కార్యాచరణ సమితి అధికార ప్రతినిధిగా, కొల్లేరు పరిరక్షణ సమితి, గోదావరి రైతాంగం కోసం ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. భీమవరం ఎడ్యుకేషనల్ సొసైటీకి, మెంటే పద్మనాభం ఇంజనీరింగ్ కళాశాలకు సెక్రటరీ అండ్ కరస్పాడెంట్‌గా వ్యవహరించారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు.