పశ్చిమగోదావరి

తప్పిన పెను ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పోలవరం, డిసెంబర్ 2: పట్టిసం ఎత్తిపోతల నిర్మాణ ప్రాంతానికి ట్రాలీపై రక్షణ చర్యలు తీసుకోకుండా తరలిస్తున్న పంపు విడిభాగాల్లో ఒకటి కన్నాపురం జంక్షన్ వద్ద జారిపడటంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. పంపు విడిభాగాలను పట్టిసం తీర్థం రేవు వద్ద ఖాళీ ప్రదేశంలో వుంచారు. కొన్ని విడి భాగాలను ఒక ట్రాలీపై నిర్మాణ ప్రాంతానికి తీసుకువస్తుండగా, కన్నాపురం అడ్డరోడ్డు వద్ద జారిపడి గట్టు కిందకు దొర్లుకుంటూ వెళ్లి, అక్కడే వున్న బాత్‌రూమ్‌ను ఢీకొట్టింది. దాని ధాటికి బాత్‌రూమ్ తునాతునకలయ్యింది. ఆ సమయంలో బస్సుల కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు, సత్యసాయి మంచినీటి పథకంలో పనిచేసే కార్మికులు, అటవీ శాఖ చెక్‌పోస్టు సిబ్బంది ట్రాలీ పైనుండి పంపు విడిభాగం పడిపోవడం చూసి ఉలిక్కిపడ్డారు. ఎటువంటి రక్షణ లేకుండా తీసుకువెడుతున్న విడిభాగాల వలన ప్రమాదం సంభవిస్తుందని అనుకున్నామని, అలాగే జరిగిందన్నారు. కాస్త ముందుగా జారివుంటే జరగరాని ఘోరం జరిగేదని వారు వాపోయారు. ఇప్పటికైనా విడిభాగాలు తరలింపులో రక్షణ చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తిచేశారు.