పశ్చిమగోదావరి

మాయా జూదం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 12 : తరతరాలుగా వస్తున్న ఆచారం, సంప్రదాయమంటూ కోడిపందాల నిర్వహణ కోసం సుప్రీంకోర్టు వరకు వెళ్లిన జిల్లాలో భోగిమంటలు, పిడకలు, గంగిరెద్దులు వంటివి మన సాంప్రదాయమంటూ ప్రదర్శించాల్సిన పరిస్థితి రావడం ఒక ఐరనీగానే చెప్పుకోవాలి. ఆ అంశాన్ని అలా ఉంచితే సంప్రదాయం పేరుతో కోడిపందాల నిర్వహణకు జిల్లా వ్యాప్తంగానే ఏర్పాట్లు పూర్తయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇంతకాలం ఈ నిర్వహణ ఎలా అన్న సందిగ్ధం కొనసాగినా గురువారం నాటి పరిస్థితి చూస్తే ఆ మూడు రోజులపాటు ఖాయంగా పందాలు జరిగే పరిస్థితే కనిపిస్తోంది. అయితే గతంతో పోలిస్తే పందాల బరుల సంఖ్య తగ్గినా ఒక అంచనా ప్రకారం చూస్తే దాదాపుగా 400 బరులు వరకు సిద్ధమైనట్లుగా సమాచారం అందుతోంది. వీటికి సంబంధించి కోడిపందాల నిర్వహణ బరులతోపాటు ఆ చుట్టూరా చేసే భారీ ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. కోళ్లు తీసుకువచ్చిన వారు విశ్రాంతి తీసుకునేందుకు ఇతర కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు తగిన ఏర్పాట్లతోపాటు పేకాట, కోతాటలతోపాటు మెగా జూదాలను నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం మీద ఒకటి, అరగా ఇప్పుడే మొదలైన పందాలు శుక్రవారం నుంచి విశ్వరూపం ప్రదర్శించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా కాకుండా న్యాయస్థానం ఆంక్షలకు అనుగుణంగా వుండేలా ఈ ప్రకటనల్లో మార్పు రావడం గమనార్హం. కోడిపందాలు అంటూ ఇంతకాలం అలవాటుగా వున్న పదాన్ని ఇప్పుడు మార్చి కోడి కుస్తీలాట నిర్వహిస్తున్నామంటూ ఆహ్వానాలు రావడం ఈసారి ఒక విశేషంగానే చెప్పుకోవాలి. కుస్తీపోటీలు పందాల పరిధిలోకి వచ్చే అవకాశం లేనందున ఆ పదాన్ని దీనికి ఖాయం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అయితే పదం ఏదైనా అసలు జరిగే వ్యవహారం మాత్రం ఎప్పటిలానే విచ్చలవిడి జూదం, కోట్లలో కోడిపందాల ఆటే సాగుతుందనడంలో సందేహం లేదు. అయితే దీనికి డింకీ పందాలు అనే ముసుగును కూడా తొడిగినట్లు కనిపిస్తోంది. కత్తులు కట్టకుండా కోళ్లు దెబ్బలాడుకుంటుంటే చూడడం అన్న అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి ఆ మాటున మరో దిక్కున అసలు కోడిపందాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు సమాచారం. కాగా పెద్దనోట్ల రద్దుతో ఈసారి కోడిపందాలు ముందుకు సాగడంపై అనేక సందేహాలు ముసిరినా దాన్ని నిర్వాహకులు పూర్తిస్థాయిలో అధిగమించినట్లు కనిపిస్తోంది. నగదు చలామణి వ్యవహారం ప్రస్తుతం కొంత సర్దుమణిగిన నేపధ్యంలో చలామణిలో వున్న నగదును పెద్ద మొత్తంలోనే వారు సమీకరించినట్లు తెలుస్తోంది. దీనికి తోడు అవసరమైతే పోస్టు డేటెడ్ చెక్కులను కూడా అప్పటికప్పుడు ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అయితే ఇవి పందెగాళ్ల పేరుమీద కాకుండా మరొకరి పేర్లపై తీసుకుని వాటిని తరువాత మార్చుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. దీనితోపాటు అంతగా అవసరమైతే ప్రామిసరీ నోట్లను కూడా అప్పటికప్పుడు సిద్ధం చేసి ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లుచేశారు. ఆ విధంగా ఏ చిన్న అవకాశాన్ని వదలకుండా పందాల నిర్వహణలో ఎటువంటి ఆటంకం రాకుండా నిర్వాహకులు సాంకేతికంగా కావాల్సిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కనిపిస్తోంది. ఇక యంత్రాంగం వైపు నుంచి చూసినా అక్కడ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లే కనిపిస్తున్నాయి. జిల్లా యంత్రాంగం ఇప్పటికే 60కి పైగా సంయుక్త తనిఖీ బృందాలను ఏర్పాటు చేయగా పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ పందాలను అడ్డుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు ప్రకటించింది. పెద్దపందాలు జరిగే ప్రాంతాల్లో ఇప్పటికే పోలీసుల హెచ్చరిక ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కోళ్లకు కత్తులు కట్టే వారిని ముందుగానే గుర్తించి 1400 మందిని బైండోవర్ చేశారు. అలాగే పందాలు చుట్టూరా జరిగే జూదాల నిర్వాహకులను గుర్తించి రెండు వేల మందిని కూడా బైండోవర్ చేశారు. ఆ విధంగా వారి ఏర్పాట్లలో వారు ముందుకు వెళుతున్నా కోడిపందాలకు సంబంధించిన అంశాన్ని, జరిగిన ఏర్పాట్లను చూస్తే శుక్రవారం నుంచి పందాల విశ్వరూపం ఇంతకుముందు మాదిరిగా కాకపోయినా అదే స్థాయిలో కనిపించే అవకాశం వున్నట్లు కనిపిస్తోంది.

సంక్రాంతి కొత్త వెలుగులు నింపాలి
ఏలూరు ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయ సంక్రాంతి సంబరాలను ప్రారంభించిన మంత్రి సుజాత

ఏలూరు, జనవరి 12 : ప్రజల జీవితాల్లో సంక్రాంతి పండుగ కొత్త వెలుగులు నింపాలని రాష్ట్ర గనులు, స్ర్తి శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత ఆకాంక్షించారు. స్థానిక ఇండోర్ స్టేడియంలో గురువారం జిల్లాస్థాయి సంక్రాంతి సంబరాలను జ్యోతిప్రజ్వలన చేసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను చాటిచెప్పే సాంప్రదాయ బద్ధమైన పండుగ సంక్రాంతని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులున్నప్పటికీ ప్రతీ ఒక్కరూ పండుగ సమయాల్లో సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు రంజాన్, క్రిష్టమస్, సంక్రాంతి పండుగలు పేదలు నిర్వహించుకోవాలనే ఉద్దేశ్యంతో 400 కోట్ల రూపాయల విలువైన చంద్రన్న తోఫా, చంద్రన్న సంక్రాంతి కానుకలను అందించారని పేర్కొన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందన్నారు. అందుకోసమే రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందన్నారు. జిల్లాలో ఖరీఫ్‌కు అవసరమైన సాగునీటిని అందించామని, రబీకి కూడా సక్రమంగా నీరు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ మాట్లాడుతూ రానున్న మూడు రోజుల్లో ప్రతీ ఇంటా సంక్రాంతి సంబరాలు ఉత్సాహపూరితమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ ఏ ఒక్క పేద కుటుంబం పండుగ జరుపుకోకుండా ఉండకూడదన్న ఉద్దేశ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు కోట్లాది రూపాయలతో సంక్రాంతి కానుకలను అందించారని తెలిపారు. జడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని వినూత్న ఆలోచనలను ముఖ్యమంత్రి అమలు చేసి ప్రతీ కుటుంబంలో ఆనందం, సంతోషాన్ని నింపుతున్నారన్నారు. ఏలూరు ఎంపి మాగంటి బాబు మాట్లాడుతూ తెలుగుజాతి సంస్కృతి, సంప్రదాయాలకు నిలువుటద్దమైన సంక్రాంతి వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా చాటిచెప్పే రీతిలో రాష్ట్ర పండుగగా సృజనాత్మక వేడుకగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మంత్రి సుజాత, కలెక్టర్ భాస్కర్, విప్ ప్రభాకర్, ఛైర్మన్ బాపిరాజు, ఎంపి మాగంటి బాబు, ఎమ్మెల్సీ రాము సూర్యారావు, మాజీ ఎమ్మెల్యేలు అంబికా కృష్ణ, కొత్తపల్లి సుబ్బారాయుడులు సంక్రాంతి సంబరాలు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వరస్వామి నమూనా ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. అనంతరం భోగిమంటలను వెలిగించారు. బాలబాలికలు చేసిన వివిధ సాంప్రదాయక నృత్య ప్రదర్శనల్లో ఎంపి మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ కలిసి పాల్గొని పిల్లల్లో ఉత్సాహాన్ని నింపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ బండారు కిరణ్‌కుమార్, మండల పరిషత్ ఉపాధ్యక్షురాలు మోరు హైమావతి, జాయింట్ కలెక్టర్-2 ఎంహెచ్ షరీఫ్, డి ఆర్‌వో కె హైమావతి, ఆర్‌డివో తేజ్‌భరత్, డి ఆర్‌డి ఏ పిడి కె శ్రీనివాసులు, డ్వామా పిడి ఎం వెంకటరమణ, డి ఇవో డి మధుసూదనరావు, మున్సిపల్ కమిషనర్ వై సాయి శ్రీకాంత్, డిఎఫ్‌వో నాగేశ్వరరావు, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్‌జెడి విద్యావతి తదితరులు పాల్గొన్నారు.

హైటెక్ హరిదాసు!
ఏలూరు, జనవరి 12 : సంక్రాంతి నెల పట్టిన అనంతరం గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో హరిదాసులు, బుడబుక్కలవారు, గంగిరెద్దు మేళాల విన్యాసాలతో గ్రామ సంచారం చేసి ఇంటింటి నుంచి కానుకలు స్వీకరించే సాంప్రదాయం పురాతన కాలం నుంచి నెలకొంది. మారిన ఆధునిక యుగంలో వారి సంఖ్య గణనీయంగా తగ్గినప్పటికీ ఆ వృత్తి మీద ఆశ వున్న వారు మాత్రం హైటెక్‌గా వ్యవహరిస్తున్నారు. బుడబుక్కల వారు కనుమరుగయ్యారు. గంగిరెద్దు విన్యాసాలు అక్కడక్కడ కొనసాగుతున్నాయి. హరిదాసులు కూడా కనుమరుగైనప్పటికీ కొన్నిచోట్ల ద్విచక్ర వాహనంపైనే ఇంటింటికీ వెళ్లి బియ్యం తదితర కానుకలు స్వీకరించడం విశేషం.