పశ్చిమగోదావరి

పందెం కాయకుండానే లక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 15: మొత్తం సంక్రాంతి సీజన్‌లో కోడిపందాలకు సంబంధించి రూపాయి పందెం కాయకుండానే భారీగా సంపాదించినవారు ఉన్నారంటే ఆశ్చర్యం కాదు. వీరికి గెలుపోటములతో సంబంధం లేదు. పందెం జరిగితే చాలు డబ్బు వచ్చి పడుతుంది. ఈరకంగా 75వేల నుంచి రెండులక్షల వరకు సంపాదించిన వారెవరా అని అశ్చర్యపోనక్కర్లేదు. వీరంతా పందెం నిర్వహించేందుకు స్ధలాలు ఇచ్చినవారు. ప్రాంతాన్ని బట్టి ఈవిధంగా స్ధలాలు పందెం నిర్వాహణకు ఇచ్చినందుకు ఒక్కొక్కరూ అయిదు నుంచి పదిలక్షల రూపాయల వరకు సంపాదించారు. కొన్నిచోట్ల భారీపందాలు జరగటంతో మొత్తం మరింత అధికంగా పలికినట్లు సమాచారం. మరీముఖ్యంగా జూదాలు పెద్దఎత్తున జరిగిన ప్రాంతాల్లో స్ధలాల యజమానులు భారీమొత్తాలను సొంతం చేసుకున్నారు. ఏటా జరిగే కోడిపందాలకు జిల్లాలో కొన్నిప్రాంతాలు ప్రసిద్ది చెందాయి. అయా ప్రాంతాల్లో పందెం నిర్వహించి తీరాలన్న పట్టుదలతోపాటు అది ప్రతిష్ఠగా మారడంతో పందెం నిర్వహణకు స్ధలాలను ఎప్పటికప్పుడు అనే్వషించుకుంటారు. ఈసారి గతానికి భిన్నంగా కొత్త స్ధలాల అనే్వషణకు నిర్వాహకులు అధికప్రాధాన్యత ఇచ్చారు. ఈరకంగా పందెం నిర్వహణకు అనుకూలంగా ఉండి కొంత లోపలికి ఉన్న ప్రాంతాలను సంక్రాంతి పండుగ మూడురోజులపాటు అద్దె ప్రాతిపదికన తీసుకుంటారు. ఈరకంగా పందెం బరులకు స్ధలం అద్దెకు ఇచ్చేవారి సంఖ్య కూడా ఈసారి పెరిగిందనే చెప్పాలి. పందెంతో సంబంధం లేకుండా రూపాయి పెట్టుబడి పెట్టకుండా సంక్రాంతి కోడిపందాల సీజన్‌లో సంపాదించిన వారు ఈస్ధలాల యజమానులంటే ఆతిశయోక్తి కాదు. ఇక జూదాల విషయానికి వస్తే నిర్వాహకుడు ఒక వ్యక్తిని బరి వద్ద నియమించాడు. అతను జూదాలలో పాల్గొనేందుకు వచ్చిన ఒక్కొక్కరు నుంచి వెయ్యి రూపాయల చొప్పున వసూలు చేస్తాడు. ఈవిధంగా రోజుకు లక్ష నుంచి రెండులక్షల రూపాయల వరకు వసూళ్లు జరిగినట్లు తెలుస్తోంది.
ఖైదీ నెంబర్ 150 హిట్ క్రెడిట్ అంతా చిరంజీవిదే
దర్శకుడు వివి వినాయక్
జంగారెడ్డిగూడెం, జనవరి 15: ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అయిందని, ఈ హిట్ మెగాస్టార్ చిరంజీవికే దక్కుతుందని స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ అన్నారు. మెగాస్టార్ చిరంజీవి 9 సంవత్సరాల విరామం తరువాత నటించిన ఖైదీ నెంబర్ 150 చ్రితం రికార్డు కలెక్షన్లతో ప్రదర్శించబడుతున్న సందర్భంగా వి.వి.వినాయక్ ఆదివారం చిత్ర పదర్శన జరుగుతున్న స్థానిక సౌభాగ్య, లక్ష్మీ థియేటర్లను సందర్శించారు. సౌభాగ్య వద్ద చిరంజీవి యువత అధ్యక్షుడు చింతల నాని పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. లక్ష్మీ టాకీస్ వద్ద కొండూరి అంజేశ్వరరావు పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అభిమానులు కోరుకునే విధంగా అన్నయ్య చిరంజీవిని సినిమాలో చూపినందుకు అభిమానులు వినాయక్‌ను హర్షధ్వానాలు, కేరింతలతో కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సౌభాగ్య థియేటర్ ఎగ్జిబిటర్ కరాట, కార్తీక్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు వలవల తాతాజి, చిరంజీవి యువత, మెగా ఫ్యామిలీ అభిమానులు షేక్ పీరూ, నారాయణ, మల్లిపూడి రవి, దొండపాటి పుల్లారావు, పండు, వసంతాటి మంగరాజు, బోయిన వెంకన్న, వర్రే దుర్గారావు, కొల్లి రామసూరి, మైరెడ్డి పవన్, బద్ది నాని, ఫరూక్, భోగాదుల సురేష్, గుబ్బల ప్రసాద్, మాచినీడి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అనంతరం వి.వి.వినాయక్ బైపాస్ రోడ్డు శ్రీనివాసపురం జంక్షన్ వద్ద మామిడి తోటలో నిర్వహిస్తున్న కోడి పందాల్లో పాల్గొన్నారు. ఆయనకు పోల్నాటి ప్రసాద్, బల్లే రాజారావు, సింగంశెట్టి సత్తిరాజు, అల్లం చిన్ని తదితరులు స్వాగతం పలికారు. అనంతరం శ్రీనివాసపురంలో సర్పంచ్ పోల్నాటి వాణీకిరణ్మయి ఇంటిలో టీ సేవించి బుట్టాయగూడెంలో డిసిసిబి మాజీ ఛైర్మన్ కరాటం రాంబాబు ఇంటికి విందుకోసం వెళ్లారు.