పశ్చిమగోదావరి

చాగల్లు జైపూర్ సుగర్స్ ఫ్యాక్టరీకి సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాగల్లు, జనవరి 20: చాగల్లు జైపూర్ సుగర్స్ ఫ్యాక్టరీ యజమాన్యం రైతులకు చెల్లించవలసిన బకాయిలు చెల్లించనందున జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఫ్యాక్టరీకి చెందిన అన్ని కార్యాలయాలు, ప్రధాన గేటుకి తహసీల్దార్ ఎం మెరికమ్మ సమక్షంలో తాళాలువేసి సీలు వేశారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ ఫ్యాక్టరీ యాజమాన్యం 2015- 2016 క్రషింగ్ సీజన్లో చెరకును ఫ్యాక్టరీకి తోలిన రైతులకు సుమారు రూ.79కోట్లను ఇప్పటివరకు చెల్లించిందన్నారు. ఇది కాకుండా ఇంకా రూ.19.7 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఆర్‌ఆర్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుని నోటీసులు జారీచేసినా ఫలితం లేకపోవడంతో జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు సీలు వేశామన్నారు. ఈ నెల 23న ఫ్యాక్టరీ ఆవరణలో ఉదయం 11 గంటలకు ఫ్యాక్టరీ ఆస్తులను, ఫ్యాక్టరీని వేలం వేయనున్నట్లు ప్రభుత్వం నోటీసు జారీ చేసిందని, దానిలో భాగంగా ఫ్యాక్టరీకి సీలు వేసినట్లు తెలిపారు. వేలంలో పాల్గొనేవారు రూ.లక్ష డిపాజిట్ కట్టి పాల్గొనవచ్చునని చెప్పారు.
ఫ్యాక్టరీ కార్మికుల సమావేశం
సుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం కార్మికులకు సుమారు 4 నెలలుగా జీత భత్యాలు చెల్లించాల్సి ఉందని, ఇటీవల పండుగ సందర్భంగా రూ.5వేలు చెల్లించారని, వేతన బకాయిలు అందక కుటుంబాలు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం కల్పించుకుని న్యాయంచేయాలని ప్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు నల్లూరి , తాళ్లూరి శ్రీనివాస్ అన్నారు. తొలుత కార్మికుల బయటకు రావటానికి హైడ్రామ జరిపారు. అనంతరం ప్రభుత్వం చర్యలకు సహకరిస్తామని కార్మికులు బయటకు వచ్చినట్లు తెలిపారు. నాయకులు కార్మికులతో మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు అడ్డుతగలవద్దని, భవిష్యత్తులో ఇటువంటి చర్యలు యాజమాన్యానికి మేలు చేకూరే ప్రమాదముందని ఫ్యాక్టరీ కార్మిక సంఘం అధ్యక్ష, ఉపాధ్యక్షులు నల్లూరి, తాళ్ళూరి శ్రీనివాస్ అన్నారు. ఫ్యాక్టరీ ఆవరణలో సుమారు 800 మంది కార్మిక కుటుంబాలు నివాసం ఉంటున్నారని, ఫ్యాక్టరీకి తాళాలువేసి సీలు వేయటం వల్ల నీరు, విద్యుత్ సరఫరాలేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వాటికి ఆటంకం లేకుండా ప్రభుత్వం చర్య తీసుకోవాలని ఫ్యాక్టరీ ఆవరణలో నివాసం ఉంటున్న కార్మిక నివాసిత కుటుంబాలు, కార్మికులు కోరగా తమ అభ్యర్థనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్య తీసుకుంటామని తహసీల్దార్ ఎం మెరికమ్మ తెలిపారు.

సమాచార సేకరణలో ఇస్రో పాత్ర కీలకం
ఉపగ్రహాలు అందించే సమాచారం ప్రజలకు చేరితేనే సత్ఫలితాలు:శాస్తవ్రేత్త జగదీష్

భీమవరం, జనవరి 20: యువ ఇంజినీర్లు భారత అంతరిక్ష పరిశోథనా మండలి (ఇస్రో) సహకారంతో సమాచార సేకరణకు శాటిలైట్స్ ప్రయోగించాలని ఇస్రో శాస్తవ్రేత్త సిజె జగదీష్ పేర్కొన్నారు. భీమవరం ఎస్‌ఆర్‌కెఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రిమోట్స్ సెన్సింగ్ సమాజ అవసరాలకు ఏ విధంగా ఉపయోగించాలనే అంశంపై శుక్రవారం విద్యార్థులతో సెమినార్ ఏర్పాటుచేశారు. హెడ్ డాక్టర్ కె బ్రహ్మరాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జగదీష్ మాట్లాడుతూ శాటిలైట్స్ వల్ల భూగర్భంలోను, భూమిలోను, భూమిపైన ఉన్న అపారమైన వనరుల సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. వాటి ఫలితాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లినప్పుడే మంచి ఫలితాలు రాబట్టవచ్చునన్నారు. అందువల్ల సామాజిక బాధ్యతగా ఇస్రో కళాశాలల్లో సదస్సులను నిర్వహిస్తోందన్నారు. రిమోట్ సెన్సింగ్ ద్వారా సముద్ర ఉత్పత్తులపై ఇచ్చిన సమాచారం ఫలితంగా పలుచోట్ల చేపల ఉత్పత్తి పెరిగిందన్నారు. అదే విధంగా భూగర్భంలో ఎక్కడెక్కడ ఎటువంటి వనరులు ఉన్నాయి, మంచినీటి వనరులు ఉన్నాయాలేదా ఇత్యాధి సమాచారం అందుబాటులోకి వస్తుందన్నారు. ఇది వెబ్‌సైట్‌లో కూడా ప్రతీ అర గంటకు సమాచారం అందుబాటులోకి ఉంచుతున్నట్లు జగదీష్ చెప్పారు. ఇంజినీరింగ్ విద్యార్థులు సమాజానికి అవసరమైన పరిశోధనలు చెయ్యాలని పిలుపునిచ్చారు. ప్రిన్సిపాల్ డాక్టర్ జి పార్ధసారధివర్మ మాట్లాడుతూ ఇప్పటి వరకు వివిధ ప్రభుత్వ సంస్థల నుంచి రూ.22 2కోట్లు విలువైన ప్రాజెక్టులు రూపొందినట్లు వెల్లడించారు. పరిశోధనా విభాగం డీన్ డాక్టర్ పిఎ రామకృష్ణంరాజు, వైస్ ప్రిన్సిపాల్ రాజు, అనీల్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.