పశ్చిమగోదావరి

పోగొండ ప్రాజెక్టు పనులు పరిశీలించిన విజిలెన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుట్టాయగూడెం, జనవరి 20: మండలంలోని చింతలగూడెం సమీపంలో నిర్మిస్తున్న పోగొండ ప్రాజెక్టు పనులను శుక్రవారం విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా విజిలెన్స్ డిఇ వైఎస్ శ్రీనివాస్ తనను కలిసిన విలేఖర్లతో మాట్లాడుతూ విజిలెన్స్ ఎస్పీ వి సురేష్‌బాబు ఆదేశాల మేరకు గత రెండు రోజులుగా పోగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. నిర్మాణంలో బండ్ లెవెల్, డ్రాప్ లెవెల్, ప్రాజెక్టు నిర్మాణాల కొలతలు, మట్టి పరిశీలనలు, తదితర అంశాలను పరిశీలిస్తున్నట్టు చెప్పారు. కొన్ని అంశాల్లో ల్యాబ్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని పేర్కొన్నారు. మధ్యతరహా నీటి ప్రాజెక్టుల్లో పోగొండ పెద్దది అని అన్నారు. సుమారు రూ. 80కోట్ల పైబడి నిర్మాణ వ్యయంతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు రెండు ఛానల్స్ ద్వారా నాలుగువేల ఎకరాలకు పైగా సాగునీరు అందుతుందని చెప్పారు. కొండకాలువలు, వాగుల ద్వారా ప్రాజెక్టుకు నిరంతరం నీరు పారడం ఈ ప్రాజెక్టుకు కలిసివచ్చే అంశంగా తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో నీటి నిల్వలు సంతృప్తికరంగా ఉన్నాయన్నారు. త్వరలో నిర్మాణం పూర్తిచేసుకుని, ఈ ఏడాది ఆగష్టు 15వ తేదీ నాటికి ప్రారంభించడానికి అవకాశమున్నట్టు తెలిపారు. ఆయన వెంట విజిలెన్స్ ఎఇ శ్రీనివాసరావు, ఐటిడిఎ ఇరిగేషన్ ఇఇ సూర్యప్రకాశరావు, ప్రాజెక్టు డిజిఎం హరికృష్ణ, ఎండి చైతన్యరాజు తదితరులున్నారు.

బడుగు వర్గాల
విద్యార్థుల కోసం
కార్పొరేట్ తరహా విద్యాసంస్థలు
సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రి మాణిక్యాలరావు

తాడేపల్లిగూడెం, జనవరి 20: దళిత, బడుగువర్గాల విద్యార్థులకు బంగారు భవిష్యత్తును ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ తరహా సదుపాయాలతో విద్యాసంస్థలను ఏర్పాటుచేస్తున్నదని దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేర్కొన్నారు. స్థానిక కడకట్ల ఎస్సీ, బిసి హాస్టల్ ప్రాంగణంలో నూతనంగా నెలకొల్పిన సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ప్రాంగణాన్ని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ప్రిన్సిపాల్ సోమయాజులు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సామాన్య, పేద, దళిత విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు నిధులు ఇచ్చి సహకరిస్తోందన్నారు. రాష్ట్రంలో నూతనంగా అయిదు గురుకుల పాఠశాలలను సాంఘిక సంక్షేమ శాఖ మంజూరు చేసిందని, వీటిలో ఒకటి తాడేపల్లిగూడెంలో ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిశోర్‌బాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఆరుగొలనులో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సమగ్ర ప్రాంగణం త్వరలో పూర్తికానందన్నారు. రూ. 4 కోట్లతో ఆధునికీకరిస్తున్న సంక్షేమ గురుకుల పాఠశాల పనులకు ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రారంభిస్తారన్నారు. కడకట్లలో అంబేద్కర్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. ఆరుగొలనులో గురుకుల డిగ్రీ కళాశాల మంజూరుకు కృషిచేస్తామన్నారు. ఈ సమావేశంలో గురుకుల విద్యాసంస్థల జిల్లా కో- ఆర్డినేటర్ ఎం డేవిడ్, ఎంఇఒ పాపారావు, తహసీల్దార్ పాశం నాగమణి, మాజీ జడ్పీటీసీ తెనే్నటి సంజయ్‌ఖాన్, మున్సిపల్ కౌన్సిలర్ పల్లి విక్రమ్, ఎఎస్‌డబ్ల్యుఒ ప్రసాద్, తానేటి ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.