పశ్చిమగోదావరి

సహకారంతోనే ‘ఆదర్శం’ సాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 20 : ప్రజలు సహకరించకపోతే ఆదర్శ గ్రామాల అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ ప్రశ్నించారు. స్థానిక కలెక్టరేట్‌లో ప్రజా ప్రతినిధుల దత్తత గ్రామాల అభివృద్ధి పనుల ప్రగతి తీరుపై శుక్రవారం అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో ఏడు పంచాయతీలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రతినిధులు మాగంటి బాబు, మాగంటి మురళీమోహన్, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, సినీ నటుడు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె చిరంజీవి, అమలాపురం ఎంపి పి రవీంద్రబాబులు దత్తత తీసుకున్నారని అయితే అన్ని పనులూ ప్రభుత్వమే చేస్తుందనే భావన విడనాడి గ్రామస్థులు కూడా సహకరిస్తే ఆశించిన అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. ఆదర్శ గ్రామాలైన తూర్పుతాళ్లు, పెదమైనివానిలంక, మొగల్తూరు మండలం పేరుపాలెం సౌత్, కామవరపుకోట మండలం కె ఎస్ రామవరం, గోపాలపురం సంజీవపురం, ఆకివీడు మండలం పెదకాపవరం, ఉండి మండలం మహదేవపట్నం, పెదపాడు మండలం పాతముప్పర్రు గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడానికి ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చారని ఈ మేరకు ఏడు గ్రామాలలో నూరుశాతం పేదలకు పెన్షన్లు, రేషన్‌కార్డులు, గృహ నిర్మాణం, 24 గంటలూ తాగునీటి సౌకర్యం, సిమెంటు రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంలతోపాటు ఆయా గ్రామాలను నూరుశాతం ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు వందలాది కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని అయితే కొన్ని గ్రామాల్లో ఇళ్లు నిర్మిస్తామని చెప్పినా గ్రామస్తులు ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాకపోవడం బాధాకరమని చెప్పారు. జిల్లాలో 909 గ్రామాలుంటే ప్రజా ప్రతినిధులు ఏడు గ్రామాలను తొలిదశగా ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించారని ఇటువంటి స్థితిలో ఆయా గ్రామాలలో ప్రజలు స్పందించి ప్రభుత్వ అభివృద్ధి పనులకు ముందుకు రావాలని ప్రతీదీ ప్రభుత్వమే చేస్తుందిలే అనే భావన విడనాడి ప్రజాసహకారం అందించినప్పుడే స్వల్ప కాలంలో ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దగలుగుతామని చెప్పారు. సంజీవపురంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టామని ఆ గ్రామంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మించడానికి 30 గృహాలు మంజూరు చేస్తే కట్టుకోవడానికి ముందుకు రాకపోవడం పట్ల కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే గ్రామ సీమలు ఎలా అభివృద్ధి సాధిస్తాయని ఇప్పటికే ఆదర్శ గ్రామాలలో ప్రజలకు నూరుశాతం వౌలిక వసతులు కల్పించడానికి చర్యలు తీసుకున్నామని వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ విషయంలో కూడా ఇంకా నిర్లక్ష్యం కనిపిస్తోందని చెప్పారు. ఫిబ్రవరి నాటికల్లా ఏడు దత్తత గ్రామాల్లో 24 గంటలూ నిరంతరం తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాను నూరుశాతం బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం కావాలని ఆయన కోరారు. ఆదర్శ గ్రామాలలో 2582 గృహాల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఆయా గ్రామాలలో ప్రజలు ఇళ్ల నిర్మాణం విషయంలో తమ వంతు సహకారం అందిస్తే ఆదర్శ గ్రామాలలో నూరుశాతం పేదలకు ఇళ్లు నిర్మించినట్లవుతుందని చెప్పారు. ఆదర్శ గ్రామాలలో 2308 వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేస్తే ఇప్పటికి కేవలం 1604 మాత్రమే నిర్మించారని ఇలా అయితే అభివృద్ధి ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. సంజీవపురం గ్రామంలో కోటి రూపాయల వ్యయంతో ఎనిమిది సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకున్నామని ఇందుకు ఓఎన్‌జిసి 50 లక్షల రూపాయలు విరాళం అందించగా మరో 50 లక్షల రూపాయలు ఉపాధి హామీ నిధులు జోడించి త్వరలోనే సిమెంటు రోడ్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. భూగర్భ డ్రైనేజీ పనులు కూడా వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తూర్పుతాళ్లు గ్రామంలో రెండు మెగావోల్టుల సోలార్ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణ పనులు నత్తనడకతో సాగడం పట్ల కలెక్టర్ నెడ్‌క్యాప్ జిల్లా మేనేజరు ప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసాపురంలో కమ్యూనిటీ హాలు నిర్మాణం, పెదమైనవానిలంకలో డిజిటల్ కమ్యూనిటీ భవన నిర్మాణ పనులు ఫిబ్రవరి నాటికల్లా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పధకం నుండి మూడు కిలోమీటర్ల మేర పిల్లకాల్వల నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని, నరసాపురం మండలం కొప్పర్రులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికపై పూర్తి చేయాలని, పేరుపాలెం సౌత్ గ్రామంలో కిలోమీటరు పొడవునా బ్రాంచి కాల్వ పొడిగింపు పనులు, లైనింగ్ పనులు, కల్వర్టు నిర్మాణం వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. సమావేశంలో జిల్లా ప్రణాళికాధికారి బాలకృష్ణ, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ అమరేశ్వరరావు, గృహ నిర్మాణ శాఖ పిడి ఇ శ్రీనివాస్, డి ఎంహెచ్ ఓ డాక్టర్ కోటేశ్వరి, నెడ్‌క్యాప్ డి ఎం ప్రసాద్, సోషల్ వెల్ఫేర్ డిడి రంగలక్ష్మీదేవి తదితరులు పాల్గొన్నారు.