పశ్చిమగోదావరి

రైతుల వద్ద నుండి ఎవరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నా నన్ను అవమానించినట్టే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, జనవరి 21: జిల్లాలో రైతుల వద్ద నుండి ఎవరైనా ఒక్క రూపాయి లంచం తీసుకున్నా తనను అవమానించినట్లేనని కలెక్టరు డాక్టరు కాటంనేని భాస్కర్ పేర్కొన్నారు. స్ధానిక కలెక్టరేట్‌లో శనివారం సేద్యపునీటి ప్రాజెక్టుల ప్రగతి, భూసేకరణ తదితర అంశాలపై అధికారులతో ఆయన సమీక్షించారు. రైతాంగాన్ని అన్నివిధాలా ఆదుకోవాలే తప్ప రైతుల నుండి ఒక్క రూపాయి లంచం ఎవరూ కూడా ఆశించవద్దని హితవు పలికారు. భూసేకరణ విషయంలో రైతాంగం భూములు ఇస్తూ సమాజానికి ఎంతో న్యాయం చేస్తున్నారని, అటువంటి రైతులు సంతోషంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, భూసేకరణ విషయాలలో నిధుల కొరత లేదని, కుకునూరు, వేలేరుపాడు మండలాల్లో భూసేకరణకు 1203 కోట్ల రూపాయలు రైతులకు పరిహారంగా చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేశామని, ఇంకా ఎంత ఖర్చు అయినా రైతులకు భూమికి భూమి, కోల్పోయిన భూమికి పరిహారం అందించి తీరుతామని కలెక్టరు చెప్పారు. జిల్లాలో వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి తాడిపూడి ఎత్తిపోతల పధకం నుండి అదనంగా లక్ష ఎకరాలకు సేద్యపునీరు అందించాలనే లక్ష్యంతో గత రెండున్నరేళ్ల నుండి తాడిపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేయాలని చెపుతున్నా కనీసం పని చేయడానికి కూడా ముందుకురాకపోవటం పట్ల ఇరిగేషన్ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సేకరించిన భూముల్లో పంటలు వేస్తుంటే ఏమి చేస్తున్నారని నిలదీశారు. ఇప్పటికైనా సమన్వయంతో పనిచేసి పనులు త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో కొయ్యలగూడెం, లింగపాలెం, టి నర్సాపురం, చింతలపూడి తదితర మండలాల్లో భూగర్భజలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయని, ఇటువంటి స్ధితిలో చింతలపూడి లిఫ్ట్ ద్వారా రైతులకు సేద్యపునీరు అందించటమే కాకుండా భూగర్భజలాలను కూడా పెంచగలుగుతామని, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు యుద్దప్రాతిపదికపై పూర్తి చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. జిల్లాలో ఇరిగేషన్ శాఖ ప్రకటించిన ప్రకారం ఎలైన్‌మెంట్ ఉంటుందే తప్ప ఏ ప్రాజెక్టు విషయంలో కూడా ఎట్టిపరిస్ధితుల్లోనూ ఎలైన్‌మెంట్ మార్పు ఉండదన్నారు. డెల్టా ఆధునీకరణ పనులు కూడా ఈసీజన్‌లో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టరు పి కోటేశ్వరరావు, భూసేకరణ ప్రత్యేక కలెక్టరు భానుప్రసాద్, జెసి-2 షరీఫ్, డిఆర్వో కట్టా హైమావతి, సబ్‌కలెక్టర్లు షాన్‌మోహన్, సుమిత్‌కుమార్‌గాంధీ, గృహనిర్మాణసంస్ధ పిడి ఇ శ్రీనివాసరావు, ఎస్‌డిసిలు ఆర్‌వి సూర్యనారాయణ, పుష్పమణి, ఆర్డీవోలు తేజ్‌భరత్, శ్రీనివాసరావు, లవన్న తదితరులు పాల్గొన్నారు.