పశ్చిమగోదావరి

ముఖ్యమంత్రి పర్యటనపై సబ్-కలెక్టర్ సమీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుకునూరు, ఏప్రిల్ 7: ఈ నెల 13న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుకునూరు మండల పర్యటన సందర్భంగా స్థానిక అధికారులతో సబ్ కలెక్టర్ షాన్ మోహన్ గురువారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో సబ్ కలెక్టర్ మాట్లాడుతూ మారేడుబాక - కివ్వాక మధ్యలోగల ఖాళీ స్థల ప్రాంగణంలో సిఎం హెలిఫ్యాడ్‌తోపాటు బహిరంగ సభ కూడా అక్కడే నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని వివిధ శాఖల అధికారులు అక్కడ ఆయా శాఖల స్టాల్స్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. సమావేశానికి విద్యుత్, ఇరిగేషన్, ఎక్సైజ్ అధికారుల గైర్హాజర్‌పై సబ్ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశంలో డివిజన్, మండల అధికారులు పాల్గొన్నారు.