వరంగల్

రైతు సమస్యలు పట్టించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఫిబ్రవరి 23: రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని ఎన్నికలకు ముందు, ఎన్నికల తరువాత హామీలు గుప్పించిన టిఆర్‌ఎస్ ప్రభుత్వ ప్రకటనలకే పరిమితమయిందని తెలంగాణ టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతుంటే పాలకుల్లో స్పందన కరువయిందని విమర్శించారు. గురువారం వరంగల్ నగర శివారులోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డును టి-టిడిపి కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాష్‌రెడ్డి, రాష్ట్రప్రధాన కార్యదర్శులు వేం నరేందర్‌రెడ్డి, సీతక్క, అర్బన్ జిల్లా కన్వీనర్ ఈగ మల్లేశం తదితరులు సందర్శించి రైతులను కలుసుకుని వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లభించక ఆర్థికభారం పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్పారు. గడచిన 32నెలల్లో రాష్టవ్య్రాప్తంగా మూడువేలమందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వరగల్ జిల్లాలోనే 379మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణను ధనిక రాష్ట్రంగా, అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధుల కొరత లేదని చెబుతున్న ముఖ్యమంత్రి కెసిఆర్ రైతుల ధీనావస్థను ఎందుకు గమనించటం లేదని ప్రశ్నించారు. వరిపంటకు సరైన గిట్టుబాటు ధర లభించని కారణంగా గత సీజన్‌లో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాని సూచించిన కారణంగా చాలాప్రాంతాల్లో కంది, మినుము, మిర్చి పంటలు వేసారని, కానీ తీరా పంట చేతికి వచ్చిన సమయంలో ఈ పంటలకు గిట్టుబాటు ధర లేకపోవటం రైతులకు ఆందోళన కలిగిస్తోందని అన్నారు. రైతు పండించిన పంటలను మార్కెట్‌కు తీసుకువస్తే మార్క్‌ఫెడ్ వంటి సంస్థలు, వ్యాపారులు లేనిపోని సాకులు చెబుతు కొనుగోలు చేయకపోవటం, కొన్న పంటకు తక్కువ ధర చెల్లించటాన్ని తప్పుపట్టారు. ఈ పరిస్థితుల్లో రైతులు ప్రైవేటు వ్యాపారులకు, దళారులకు వచ్చిన ధరకు పంటను అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. రైతుల ఇబ్బందులను ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో టిడిపి ఆధ్వర్యంలో ఆందోళనలు చేపట్టేందుకు ప్రయత్నిస్తే పోలీసుల సహాయంతో ప్రభుత్వం అడ్డుకోవటాన్ని తీవ్రంగా విమర్శించారు. ప్రతిపక్షాల ఆందోళనలను అడ్డుకోవటం తప్ప రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించటం లేదని విమర్శించారు. రైతుల ఇబ్బందులను, మార్కెట్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని మిర్చికి క్వింటాలుకు 10వేలు, కందులకు కనీసం ఎనిమిది వేలు చెల్లించేలా, మార్క్‌ఫెడ్ ద్వారా పంటలు కొనుగోలు చేసేలా చూడాలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేసారు. ఇప్పటి వరకు రైతులు తక్కువ ధరకు విక్రయించిన కందులు, మిర్చి పంటకు ప్రభుత్వం మార్క్‌ఫెడ్ ద్వారా పరిహారం చెల్లించాలని అన్నారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రప్రభుత్వం వంద కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్ ఫండ్ ఏర్పాటుచేసి రైతులను ఆదుకోవాలని, రైతుల ఆత్మహత్యల నివారణకు చర్యలు చేపట్టాలని, మరణించిన రైతుల కుటుంబాలకు ఆరులక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేసారు. సీజన్‌కు ముందే అవసరమైన విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు, క్రిమిసంహారక మందుల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు వివిధ పంటలకు కనీస మద్దతుధర ప్రకటించి అమలు చేయాలని అన్నారు. అనంతరం రేవంత్‌రెడ్డి, టిడిపి నాయకులు రూరల్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్‌ను కలిసి సమస్యల పరిష్కారం కోసం వినతిపత్రం అందచేసారు.