పశ్చిమగోదావరి

భీమవరంలో 7కె రన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, ఫిబ్రవరి 26: గుండె..గుండెను జెండాగా మలుచుకుందాం..మువ్వనె్నల జెండాలో తిరంగా రంగులం అందరం. జెండా కీర్తిని దిశదశలా చాటుదాం..అంటూ నినదించారు భీమవరం పురప్రజలు. పట్టణంలోని ఆదివారం వాకర్స్ ఇంటర్నేషనల్, వెస్ట్‌బెర్రీ స్కూల్ సంయుక్తంగా ఆరోగ్యకర జీవనం-ఆభందానికి ఆభరణం, ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదిద్దాం-పర్యావరణాన్ని రక్షించుకుందాం , స్వచ్ఛ భారత్, స్వచ్ఛ భీమవరం నినాదంతో 7కె రన్‌ను నిర్వహించారు. పట్టణంలోని 13 వాకర్స్ అసోసియేషన్ల నుంచి, పుర ప్రజలు వేలాదిగా ఈ 7కె రన్‌కు తరలివచ్చారు. ఉదయానే్న పురవీధులన్నీ వారితో నిండిపోయాయి. మూడు పర్యాయాలు గిన్నీస్ రికార్డులను సాధించిన మాస్ట్రో గజల్ శ్రీనివాస్ గౌరవ అతిథిగా ఈ రన్‌కు హాజరయ్యారు. ఎంపి తోట సీతారామలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళలకు పుట్టినిల్లు భీమవరం అని అన్నారు. స్వచ్ఛమైన మనస్సున్నవారు భీమవరంలో ఉండటం వల్ల స్వచ్ఛ భీమవరం సాధించాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపుమేరకు స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భీమవరం సాధించాలని పిలుపునిచ్చారు. గతేడాది తక్కువ మందితో ప్రారంభమైన ఈ రన్ వేలాది మందితో ఈ ఏడాది నిర్వహించిన నిర్వాహకులు బొండా శ్రీరామ్, మహేష్‌కుమార్‌లను ఎంపి సీతారామలక్ష్మి అభినందించారు. మంచి ఆరోగ్యం కోసం అందరం నడవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు స్వచ్ఛాంధ్రప్రదేశ్ సాధనకు అందరం సమిష్ఠిగా కలిసి సాదిద్ధామన్నారు. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, మున్సిపల్ ఛైర్మన్ కొటికలపూడి గోవిందరావు పట్టణంలో ప్లాస్టిక్ నిషేధానికి అందరూ సహకరించాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ సిహెచ్ నాగనర్సింహరావు స్వచ్ఛ భీమవరం ఏ విధంగా సాకారం చేసుకోవాలో వివరించారు. ముందుగా దేశం కోసం అందరం అని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక బివి రాజు పార్కు నుంచి వెస్ట్‌బెర్రీ స్కూల్‌కు 7కె రన్‌ను పూర్తిచేశారు. పలువురిని సత్కరించారు. 7కె రన్ ఛైర్మన్ బొండా శ్రీరామ్, కోఛైర్మన్ నడింపల్లి మహేష్‌కుమార్, కన్వీనర్ వడుపు గోపి, కో-ఆర్డినేటర్ బొండా రాంబాబు, గోకరాజు రామరాజు, తోట భోగయ్య , అంతర్జాతీయ స్నూకర్ క్రీడాకారిణి బొండా వైష్ణవి, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారులు ముదునూరి చలపతి రామకృష్ణంరాజు, ఏషియన్ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు సత్తి సుబ్బన్న రెడ్డి తదితరులు పాల్గొన్నారు.