పశ్చిమగోదావరి

ప్రశాంతంగా గ్రూప్-2 పరీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 26 : జిల్లాలో ఎపిపిఎస్‌సి ఆధ్వర్యంలో గ్రూప్-2 వ్రాత పరీక్షలు ప్రశాంతంగా పారదర్శకంగా జరిగాయని 74.39 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. జిల్లాలో ఆదివారం పది ప్రాంతాలలో 65 కేంద్రాలలో ఈ పరీక్షలు ఎంతో పటిష్టవంతంగా నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఏలూరు సి ఆర్ రెడ్డి డిగ్రీ, ఇంటర్ కళాశాలలో రెండు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి ప్రశ్నాపత్రాలు, హాజరు తీరులను కలెక్టర్ పరిశీలించారు. సత్రంపాడులోని సి ఆర్ రెడ్డి మహిళా కళాశాలలో, వట్లూరులోని సి ఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో గ్రూప్-2 పరీక్షా కేంద్రాలను కలెక్టర్ తనిఖీ చేశారు. అక్కడ విజువల్లీ ఛాలెంజ్‌డ్ విద్యార్ధికి సహకరిస్తున్న మహిళ సక్రమంగా ఆన్సర్లు పొందుపరుస్తున్నారా? లేదా? అని పరిశీలించారు. చూపుదోషం ఉన్న వారందరికీ ప్రత్యేకంగా సహాయకులను సమకూర్చామని జిల్లాలో ఎక్కడా కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 65 పరీక్షా కేంద్రాలలో గట్టి పోలీసు బందోబస్తు మధ్య ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని చెప్పారు. 39828 మంది అభ్యర్ధులకు 29627 మంది అభ్యర్ధులు హాజరైనారని జిల్లా వ్యాప్తంగా 74.39 శాతం హాజరుకావడం చూస్తే ఈ పరీక్షలు విజయవంతమైనట్లు భావిస్తున్నామని చెప్పారు. గతంతో పోలిస్తే గ్రూప్-2 పరీక్షకు హాజరైన వారి సంఖ్య అధికంగా ఉన్నదని ప్రజల్లో ఈ పరీక్షపై సరైన అవగాహన ఉన్నందున ఉదయం నుండే అభ్యర్ధులు పరీక్షా కేంద్రాలకు తరలి వచ్చారని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో భీమవరం ప్రాంతంలో అత్యధికంగా 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా పెదవేగిలో అతి తక్కువగా ఒక పరీక్షా కేంద్రాన్ని నిర్వహించామని, తతణుకులో 11, ఏలూరులో 8, పాలకొల్లు, జంగారెడ్డిగూడెంలలో ఏడేసి, తాడేపల్లిగూడెంలో 6, పెదపాడులో 4, నల్లజర్లలో 3, నరసాపురంలో 2 చొప్పున పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసామని అన్ని చోట్లా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగాయని చెప్పారు. ఎక్కడా కూడా మాల్ ప్రాక్టీస్‌కు గానీ, మాస్ కాపియింగ్‌కు గానీ ఆస్కారం లేకుండా 9 మంది స్పెషల్ ఆఫీసర్లను, 30 మంది లైజాన్ ఆఫీసర్లు నిరంతరం పర్యవేక్షణ చేసారని చెప్పారు. గ్రూప్-2 పరీక్షలు పశ్చిమగోదావరి జిల్లాలో ప్రశాంతంగా జరగడానికి పూర్తిస్థాయిలో సహకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్, జిల్లా ఎస్‌పి భాస్కర్ భూషణ్, జాయింట్ కలెక్టర్ పి కోటేశ్వరరావు, డి ఆర్‌వో కట్టా హైమావతిలకు ఎపిపి ఎస్‌సి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఎపిపి ఎస్‌సి అసిస్టెంట్ సెక్రటరీ వి రమేష్‌బాబు చెప్పారు.
కాపులను బీసీల్లో చేర్చాలని సత్యాగ్రహం
ఏలూరు, ఫిబ్రవరి 26 : కాపు సంఘ రాష్ట్ర నేత ముద్రగడ పద్మనాభంకు మద్దతుగా ప్రభుత్వ ఎన్నికల మానిఫెస్టోలో రూపొందించిన ప్రకారం కాపులను బిసిల్లో చేర్చాలని కోరుతూ నగరంలోని కాపు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం గాంధీమైదానం సెంటర్‌లో ఒక రోజు సత్యాగ్రహాన్ని నిర్వహించారు. తొలుత జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కాపు సంఘ నాయకులు జల్లా హరికృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని తాము ఎటువంటి కోర్కెలు కోరడం లేదని, డిమాండ్లు కూడా చేయడం లేదని, కేవలం తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మాత్రం అమలు చేయాలని కోరుతున్నామని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి హామీని అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాపులను బిసిల్లో చేర్చాలంటూ కొద్దిసేపు నినాదాలతో హోరెత్తించారు.