పశ్చిమగోదావరి

భారం కాకుండా ఛార్జీల పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 28: విద్యుత్తు వినియోగదారులకు తలకుమించి భారం కాకుండా, విద్యుత్తు పంపిణీ సంస్థ మనుగడ ప్రశ్నార్ధకం కాకుండా మధ్యే మార్గంగా విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఛైర్మన్ జస్టిస్ జి భవాని ప్రసాద్ అభిప్రాయం వ్యక్తం చేశారు. స్థానిక కలెక్టరేట్ నూతన సమావేశ మందిరంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ ప్రతిపాదించిన 2017-18 ఆర్ధిక సంవత్సరానికి వార్షికాదాయ అవసరాలు రిటైల్డు సరఫరా ధరలపై జరిగిన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారులకు పూర్తిస్థాయి సేవలు అందిస్తామన్నారు. వినియోగదారుడు సంతోషంగా ఉంటేనే ఆయా సంస్థలు పురోభివృద్ధి సాధిస్తాయని ఈ దిశగా విద్యుత్తు సంస్థలు తమ సేవలను విస్తరించాలన్నారు. ప్రస్తుతం పొరుగు రాష్ట్రాలకన్నా వివిధ టారీఫ్‌లు తక్కువగా ఉండడంతోపాటు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు. రాష్ట్ర విభజన నేపధ్యంలో తలెత్తిన వివిధ సమస్యలను నెట్టుకొస్తే ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా విద్యుత్తు పంపిణీలో మెరుగైన ఫలితాలు సాధించగలుగుతున్నామన్నారు. దేశంలో విద్యుత్తు పంపిణీ, టారిఫ్ తదితర విషయాల్లో అవలంబిస్తున్న నియమనిబంధనలను కూలంకషంగా పరిశీలించేందుకు 30 రాష్ట్రాల్లో రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఉన్నతాధికారులు పర్యటించి ఆయా ప్రాంతాలలో అమలుచేస్తున్న విధానాలను తెలుసుకుంటారన్నారు. వాటిని భేరీజు వేసి ఏది మంచిదని గుర్తిస్తే వాటిని అమలుచేస్తే ఒక ప్రయత్నం జరుగుతుందన్నారు. 300 మంది వినియోగదారులకు ఒక ఉద్యోగి సేవలు అందించవలసి ఉండగా ప్రస్తుతం 500 మంది వినియోగదారులకు సేవలు అందించడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఐదారు గ్రామాలకు కలిపి ఒకే లైన్ మెన్ పనిచేసే పరిస్థితి ఉందని దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం పెరిగిన పనిభారానికి పెరిగిన వినియోగదారుల సంఖ్యను పరిగణనలోనికి తీసుకుని ఉద్యోగుల సంఖ్య పెంచవలసిన అవసరం వుందని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు కూడా సహకరించాలని ఆయన కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు చట్టం 2005 ప్రకారం ఆంగ్లంలో ఉన్న విద్యుత్తు నియమాలునిబంధనలు తెలుగులో అనువధించడం జరిగిందని వీటిని తక్కువ వెలతో అందరికీ అందుబాటులో ఉంచడంతోపాటు వెబ్‌సైట్‌లో పొందుపరిచామన్నారు. కొత్త నిబంధనలపై సంపూర్ణ అవగాహన లేకపోవడం వలనే ఇంకా పాత నిబంధనలు అమల్లో ఉన్నాయని ఆయన చెప్పారు. ఎపి ఇపిడిసిఎల్ సిఎండి నాయక్ పవర్ పాయింట్‌ప్రజంటేషన్ ద్వారా విద్యుత్తు ఛార్జీల పెంపు ప్రతిపాదన వివరాలను వివరించారు. సామాన్య ప్రజలపై ఎటువంటి భారం లేకుండా విద్యుత్తు సంస్థ మనుగడను దృష్టిలో ఉంచుకుని ఈ ఛార్జీలను రూపొందించామని చెప్పారు. గృహ విద్యుత్తు వినియోగదారులకు సంబంధించి ఎల్‌టి గ్రూపు- ఏ, గ్రూపు-బి, గ్రూపు-సిలలో సంబంధించి కేవలం 2.67 శాతం ప్రతిపాదించడమైనదన్నారు. గృహేతర వాణిజ్య ఎల్‌టి సర్వీసులకు సంబంధించి 4.44 శాతం, ఎల్‌టి పరిశ్రమల కేటగిరీలో 4.92 శాతం పెంపుదల ప్రతిపాదించడమైనదన్నారు. అయితే సీజనల్ సాధారణ పరిశ్రమలు, పూలతోటల పెంపకం, ఆక్వా కల్చర్ తదితర పరిశ్రమలకు సంబంధించి ఛార్జీలను కొంతమేర తగ్గిస్తూ ప్రతిపాదించామన్నారు.
విప్ చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గ్రామీణ విద్యుద్దీకరణలో జిల్లా దేశంలోనే ప్రధమంగా నిలవడం అభినందనీయమన్నారు. జిల్లా అంతటా వీధిదీపాలకు విద్యుత్తు సరఫరా లేక అంధకారంలో ఉండేదని బకాయిలు కట్టలేని పరిస్థితుల్లో పంచాయితీలున్నాయన్నారు. ఒక్కొక్క గ్రామంలో వెయ్యి నుంచి మూడు వేల వరకు విద్యుత్తు స్థంభాలున్నాయని వాటి ఏర్పాటుకు పంచాయితీలకు విద్యుత్తు పంపిణీ సంస్థ సొమ్ము చెల్లిస్తే పంచాయితీలు విద్యుత్తు బిల్లులు చెల్లించగలవన్నారు. ఈ విషయంలో మండలి పునఃసమీక్ష చేయాలని ఆయన కోరారు. భారతీయ కిసాన్ సంఘ్ కార్యదర్శి జలగం కుమారస్వామి మాట్లాడుతూ నిర్ణీత ఛార్జీలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఫిక్స్‌డ్ ఛార్జీల వలన ఆక్వా, పరిశ్రమలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. సిపిఎం జిల్లా కార్యదర్శి బి బలరామ్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యుత్తు మొండి బకాయిలను వెంటనే వసూలు చేయాలన్నారు. సి ఐటియు ప్రధాన కార్యదర్శి తరఫున డిఎన్‌విడి ప్రసాద్ మాట్లాడుతూ విద్యుత్తు సంస్థల్లో శాశ్వత స్వభావం కలిగిన పనుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలన్నారు. సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు పిల్లి సత్తిరాజు, గౌరీ పట్నం క్రషర్స్ యూనియన్ నాయకులు శేషగిరి, కోరమండల్ ఫర్టిలైజర్స్ ప్రతినిధి ఎ శ్రీహరి, మొక్కజొన్న సీడ్స్ ప్రతినిధి ఆర్ రామారావు, అల్లూరి వెంకట రాఘవరావు, ఎ పెద్దిరాజు, పి రామకృష్ణ తదితరులు తమ సమస్యలను తెలియజేస్తూ ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి విద్యుత్తు బిల్లుల టారీఫ్ పెంచవద్దని వినియోగదారులపై భారం మోపవద్దని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్తు నియంత్రణ మండలి సభ్యులు డాక్టర్ పి రఘు, పి రామ్మోహనరావు, కార్యదర్శి ఎ శ్రీనివాస్, డిప్యూటీ డైరెక్టర్ ఎం ఎస్ విద్యాసాగర్ ట్రాన్స్‌కో ఎస్ ఇ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.