పశ్చిమగోదావరి

అట్టహాసంగా నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, ఫిబ్రవరి 28: శాసనమండలి స్థానిక సంస్ధల నియోజకవర్గాలకు పోటీ చేస్తున్న అధికార పార్టీ అభ్యర్ధులు భారీ ఊరేగింపుల మధ్య అట్టహాసంగా తమ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల దాఖలుకు చివరిరోజు కావటంతో వీరు ఉరుకులు, పరుగుల మీద నామినేషన్లు దాఖలు చేయాల్సి వచ్చింది. మంగళవారం ఉదయం నుండి జిల్లా కలెక్టరేట్ ప్రాంగణం వద్ద అభ్యర్ధుల మద్దతుదారులతో కోలాహాలంగా కన్పించింది. జిల్లాలో ఉన్న రెండు స్దానిక సంస్ధల నియోజకవర్గాల స్ధానాలకు అధికారపార్టీ తరపున ఇద్దరు, మరో అయిదుగురు ఇండిపెండెంట్లుగా తమ నామినేషన్లను జాయింట్ కలెక్టరు, రిటర్నింగ్ అధికారి పి కోటేశ్వరరావు ఎదుట దాఖలు చేశారు. టిడిపికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్(ఆచంట), మంతెన వెంకట సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)(ఉండి మండలం పాందువ్వ), స్వతంత్ర అభ్యర్ధులుగా నల్లి రాజేష్(పాలకొల్లు), మేడపాటి సాయిచంద్రవౌళీశ్వరరెడ్డి(పెనుగొండ), కోలా రామచంద్రరావు(్భమవరం), మైలా వసంతరావు(నరసాపురం), డిఎస్‌ఎస్ ప్రసాద్(నరసాపురం)లు నామినేషన్లు దాఖలు చేశారు. తొలుత టిడిపి అభ్యర్ధులు అంగర, పాందువ్వ శ్రీనులు స్ధానిక జిల్లా టిడిపి కార్యాలయం నుంచి భారీ ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రి పీతల సుజాత, జిల్లా పార్టీ అధ్యక్షురాలు, ఎంపి తోట సీతారామలక్ష్మి, జడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు, ఎంపిలు మాగంటి బాబు, గోకరాజు గంగరాజు, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్‌తోపాటు జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఈర్యాలీలో పాల్గొన్నారు. ఈసందర్భంగా కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటుచేశారు.
సమన్యాయం:మంత్రి అయ్యన్న
రాష్ట్రంలోనూ, జిల్లాలోనూ నెలకొన్న రాజకీయపరిస్థితుల నేపథ్యంలో సమన్యాయంచేసే ఉద్దేశ్యంతోనే అభ్యర్దుల ఎంపిక జరిగిందని రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. ఉన్న రెండు సీట్లలో ఒకటి బిసిలకు, మరొకటి ఒసిలకు కేటాయించామన్నారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన అభ్యర్ధులు సీట్లు ఆశించారని, పరిస్థితుల ప్రభావం కారణంగా సమన్యాయం చేయడానికే ఈవిధంగా సీట్ల కేటాయింపు జరిగిందన్నారు.
అందరికి న్యాయం:మంత్రి పీతల
గత ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడానికి ఎంతోమంది నాయకులు కృషి చేశారని, వారందరికి తగిన న్యాయం జరుగుతుందని రాష్ట్ర మంత్రి పీతల సుజాత స్పష్టం చేశారు. ఈవిధంగానే రానున్నరోజుల్లో కూడా పార్టీ కోసం కష్టపడినవారికి తగిన గుర్తింపు ఇచ్చే విధంగా చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
బిసిల అభివృద్ధికి కృషి :అంగర
జిల్లాలో బిసిల అభివృద్ధికి తాను కృషి చేస్తానని టిడిపి ఎమ్మెల్సీ అభ్యర్ధి అంగర రామ్మోహన్ తెలిపారు. ఇంతకుముందుకూడా తనకు ఎమ్మెల్సీగా పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించిందని, ఇప్పుడు మరోసారి బిసి సామాజికవర్గం ప్రాతిపదికన తనను ఎంపిక చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు సీటురావడానికి సహకరించిన నాయకులందరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బిసిల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.
సమన్వయంతో పనిచేస్తా:పాందువ్వ
జిల్లాలో పార్టీ అభివృద్ధికి, ప్రజాసమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తానని టిడిపి మరో ఎమ్మెల్సీ అభ్యర్ధి మంతెన వెంకట సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను) తెలిపారు. తాను ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు అవకాశం కల్పించారని ఈసందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా తనకు ఈ అవకాశం వచ్చేందుకు జిల్లాలోని ప్రజాప్రతినిధులు ఎంతోగానో కృషి చేసారని వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నానని చెప్పారు. 2019 ఎన్నికల్లో కూడా పార్టీని అధికారంలోకి తీసుకువచ్చే లక్ష్యంతో పనిచేస్తామన్నారు.
పోటీ తప్పదా...

ఏలూరు, ఫిబ్రవరి 28: జిల్లాలో పెద్దల సభకు జరుగుతున్న పోరు దాదాపుగా సిద్ధమైంది. అధికారపార్టీ అభ్యర్ధులు ఖరారు కావటంతో నామినేషన్ల దాఖలుకు చివరిరోజున ఒకరకంగా చెప్పాలంటే అభ్యర్దులు పోట్టెత్తారని భావించవచ్చు. వాస్తవంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధుల గణాంకాలను చూస్తే అధికారపార్టీకి ఈ రెండు సీట్లు దాదాపుగా కైవసం అవుతాయనే భావించవచ్చు. అయితే చివరి నిముషం వరకు ఎన్నికల రణరంగంలో పావులు ఎటునుంచి ఎటుమారతాయన్నది కొంత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి అధికారపార్టీ తరపున అభ్యర్ధులుగా పదవీవిరమణ చేస్తున్న అంగర రామ్మోహన్, పాందువ్వ శ్రీను ఎంపికకాగా వారు మంగళవారం నామినేషన్లు దాఖలుచేశారు. అయితే నామినేషన్ల దాఖలు ఇన్నిరోజుల నుంచి స్తబ్ధుగా ఉండిపోగా చివరి రోజున మరో అయిదుగురు అభ్యర్ధులు స్వతంత్రులుగా రంగంలోకి దిగారు. అయితే వీరిలో ఎంతమంది నామినేషన్లను ఉపసంహరించుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గణాంకాలను బట్టి బట్టి అందరూ ఉపసంహరణ బాటలో నడిస్తే రెండుస్ధానాలు ఏకగ్రీవం అవుతాయి. అయితే ప్రతిపక్ష వైకాపా అప్పనంగా ఈ రెండు సీట్లను అధికారపార్టీకి అప్పగించడానికి సిద్దంగా ఉండకపోవచ్చునని చెపుతున్నారు. వైకాపాకు చెంది, మంగళవారం స్వతంత్రులుగా రంగంలోకి దిగిన డిఎస్‌ఎస్ ప్రసాద్, సాయి చంద్రవౌళీశ్వరరెడ్డి అభ్యర్ధులుగా కొనసాగుతారా, లేక వారుకూడా ఉపసంహరణదిశగా సాగుతారా అన్నది మార్చి 3వ తేదీనగాని తేలదు. ఆరోజునే ఎమ్మెల్సీ బరికి సంబంధించిన స్పష్టమైన చిత్రం తెరపైకి వస్తుంది. వాస్తవానికి ఒక రాయి వేస్తే పోయేదేముందన్న అభిప్రాయంలో వైకాపా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే నిజమైతే రానున్నరోజుల్లో ఎమ్మెల్సీ పోరు మరింత ఉత్కంఠభరితంగాను, మరింత ఆసక్తిగాను మారుతుందనే చెప్పాలి. అలాకాకుంటే 3వ తేదీనే ఈ మొత్తం వ్యవహారం ఒకకొలిక్కి వచ్చేసే పరిస్థితులు స్పష్టంగా కన్పిస్తున్నాయి. మొత్తంగా చూస్తే ఎమ్మెల్సీ పోరు చిత్రం ఇలాఉంటే మరోవైపు అధికారపార్టీలోనూ అభ్యర్ధుల ఎంపిక వ్యవహారంలో అసంతృప్తి స్వరాలు తెరవెనుకనుంచి గట్టిగానే వినపడటం ప్రారంభమయ్యాయి. టిడిపి అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందన్న అభిప్రాయంలోనే ఉన్నారు. ఆయన వర్గంలోనూ ఇదే అభిప్రాయం బలంగా కొనసాగుతూ వచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి హామీ ఇచ్చినందున అది ఏదొ ఒకరోజు అమలవుతుందని వేచిచూస్తు వచ్చారు. అయితే సోమవారం రాత్రి నాటి పరిణామాల్లో ఈసారి కూడా అంబికాకు ఛాన్స్ రావటం హుళక్కేనని తేలిపోవటంతో ఆయన వర్గం తీవ్ర అసంతృప్తిలో మునిగిపోయింది. దీనికితోడు మంగళవారం ఒకప్రక్క టిడిపి అభ్యర్ధులు నామినేషన్లకు సిద్ధమవుతున్న తరుణంలో ఏలూరులోని మెయిన్‌బజారులో అంబికా కృష్ణ వర్గానికి చెందిన సంఘాలు పెద్దఎత్తున ధర్నా నిర్వహించి అంబికాకు పదవి ఇవ్వాల్సిందేనంటూ పట్టుపట్టారు. ఈవిధంగానే అసంతృప్తులు మరికొన్ని ప్రాంతాల నుంచి విన్పిస్తూనే ఉన్నాయి. వీటిని ఏవిధంగా సర్దుబాటు చేస్తారు అన్నది కూడా ఎమ్మెల్సీ పోరులో ఒక కీలకమైన అంశంగానే భావించాల్సి ఉంటుంది. ఇక టిడిపి అభ్యర్ధుల ఎంపికలో తనదైన శైలిలోనే ముందుకెళ్లింది. అవిధానాన్ని చూస్తే భారీ కసరత్తులు, ఐవిఆర్‌ఎస్ పేరుతో అభిప్రాయసేకరణ తదితర హంగామాల నడుమ శాసనమండలి స్ధానిక సంస్ధల నియోజకవర్గాల అభ్యర్ధులను ప్రకటించింది. పార్టీకి విధేయులుగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, సత్యనారాయణరాజు(పాందువ్వ శ్రీను)లను అభ్యర్ధులుగా పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. శరవేగంగా మారుతూ వచ్చిన పరిణామాలు చివరకు వీరిద్దరి ఎంపికతో నిలిచిపోయాయి. అయితే తొలిదశలో పలువురి పేర్లు ప్రముఖంగా చర్చకు వచ్చాయి. అంబికా కృష్ణ, మెంటే పార్ధసారధి, ముళ్లపూడి రేణుక, దొమ్మేటి సుధాకర్, యర్రా నవీన్, కొత్తపల్లి సుబ్బారాయుడు, చెరుకువాడ శ్రీరంగనాధరాజు తదితర పేర్లు తెరపైకి వచ్చాయి. వీటిపై గత కొద్దిరోజులుగా జిల్లా, రాజధాని స్దాయిలో భారీ కసరత్తు జరిగింది. చివరకు సోమవారం మధ్యాహ్నం నుంచి ఐవిఆర్‌ఎస్ పేరుతో అభిప్రాయసేకరణకు శ్రీకారం చుట్టారు. మొదట ఏడుపేర్లతోను, ఆనంతరం రెండు పేర్లతోనూ స్ధానిక సంస్ధల ఓటర్ల నుంచి అభిప్రాయసేకరణ జరిపారు. వీటిలో అంగర రామ్మోహన్, పాందువ్వ శ్రీను, మెంటే పార్ధసారధి పేర్లు ప్రముఖంగా విన్పించాయి. చివరకు అంగర, పాందువ్వ అభ్యర్దిత్వాలను పార్టీ ఖరారు చేసింది. బిసి నేతల్లో అంగరది విభిన్నమైన నేపధ్యం. పార్టీ అవిర్భావం నుంచి అంగర అంకితభావంతో సేవలందిస్తూ వచ్చారు. పాలకొల్లు నియోజకవర్గ పరిధిలో ఆయన పార్టీ విజయం కోసం పలుమార్లు కీలకంగా నిలుస్తూ వచ్చారు. ఇక సత్యనారాయణరాజు కూడా 2004 నుంచి పార్టీకి విధేయునిగా ఉంటూ వచ్చారు. పార్టీ అధికారంలో లేని సమయంలో కూడా ఆయన ఎన్నో సేవలు అందిస్తూ వచ్చారు. చంద్రబాబు నిర్వహించిన పాదయాత్రలలో కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. రాష్ట్ర పార్టీ నేతగా కూడా పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా వ్యవహరించారు. కాగా అప్పట్లో ఈయనతోపాటు పార్టీకి సేవలందించినవారిలో అధికశాతం మందికి పదవులు లభించటం, ఆ జాబితాలో ఈయన మిగిలిపోవటంతో ఈసారి ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని చెపుతున్నారు.
బ్యాంకు ఉద్యోగుల సమ్మె విజయవంతం
ఏలూరు, ఫిబ్రవరి 28: బ్యాంకు ఉద్యోగుల పట్ల కేంద్రప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను తక్షణమే విడనాడాలని డిమాండ్ చేస్తూ యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ ఆధ్వర్యంలో మంగళవారం దేశవ్యాప్తంగా చేపట్టిన సమ్మె జిల్లాలో కూడా కొనసాగింది. అన్నిచోట్ల బ్యాంకులు మూతపడ్డాయి. జిల్లాలో 650 జాతీయబ్యాంకు శాఖల్లో పనిచేస్తున్న సుమారు నాలుగువేలమంది ఉద్యోగులు విధులు బహిష్కరించి సమ్మెబాట పట్టడంతో అన్నిబ్యాంకులు మూతపడ్డాయి. మంగళవారంనాడు బ్యాంకుల సమ్మె కారణంగా దాదాపు 800కోట్ల రూపాయల లావాదేవీలు నిలిచిపోయినట్లు సమాచారం. ఏలూరులో జాతీయ బ్యాంకు శాఖల ఉద్యోగులు చేపట్టిన సమ్మె విజయవంతం అయింది. స్ధానిక ఆర్‌ఆర్ పేటలోని ఆంధ్రాబ్యాంకు వద్దకు ఉదయం బ్యాంకు ఉద్యోగులు పెద్దఎత్తున చేరుకుని పెద్దపెట్టున నినాదాలు చేశారు. బ్యాంకు ఉద్యోగుల ఆందోళనకు సిఐటియు, ఎఐటియుసి మద్దతు తెలిపాయి. అనంతరం వారంతా స్టేట్ బ్యాంక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా యూనియన్ నాయకులు శివసుబ్రహ్మణ్యం, కాలే శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రప్రభుత్వం బ్యాంకు ఉద్యోగులపై పనిఒత్తిడి పెరిగేవిధంగా, జాతీయ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశ్యంతో పలు సంస్కరణలు తీసుకువస్తోందన్నారు.