పశ్చిమగోదావరి

కమలేష్ చంద్ర సిఫార్సులు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 13: తపాలా శాఖలో పనిచేస్తున్న గ్రామీణ డాక్ సేవక్ ఉద్యోగుల కోసం నియమించిన కమలేష్ చంద్ర కమిటీ సిఫార్సులను కేంద్రం వెంటనే అమలు చేయాలని గ్రామీణ డాక్ సేవక్ (గ్రామీణ తపాలా ఉద్యోగులు సంఘం) ఆలిండియా జనరల్ సెక్రటరీ పి పాండురంగారావు డిమాండ్ చేశారు. అదే విధంగా 7వ వేతన సంఘం సిఫార్సుచేసిన ప్రతికూల అంశాలను సరిచేయాలన్నారు. ప్రభుత్వం వీటిపై మొగ్గుచూపడం లేదన్నారు. ఈ నెల 16న జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చెయ్యాలని ఆయన పిలుపునిచ్చారు. సోమవారం భీమవరంలోని పోస్టల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ భీమవరం డివిజన్ (ఆంధ్రప్రదేశ్ సర్కిల్) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పి పాండురంగారావు మట్లాడుతూ ఈ సమ్మెలోని తపాలా శాఖ, రైల్వే, రక్షణ రంగం ఉద్యోగులు మొత్తం 15 లక్షల మంది పాల్గొనున్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన 110 శాఖల నుంచి ఉద్యోగులు సమ్మెను విజయవంతం చేయడం జరుగుతుందని వివరించారు. దేశం మొత్తం మీద తపాలా శాఖలోని 4.85 లక్షల మంది ఉద్యోగులు వివిధ స్ధాయిల్లో పనిచేస్తుండగా, ఈ శాఖకు మూలమైన గ్రామీణ ప్రాంతాల్లోని 2.7 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని వెల్లడించారు. అయితే ఉద్యోగ సంఘాలు ఆందోళన చేస్తున్నా కేంద్ర ఆర్ధిక శాఖా మంత్రి అరుణ్‌జైట్లీ, హోం శాఖ మంత్రి రాజ్‌నాధ్‌సింగ్, మంత్రి సురేష్ ప్రభులు పట్టించుకోవడం లేదన్నారు. చర్చలు విఫలంకావడం వల్ల దేశవ్యాప్త సమ్మెకు దిగామన్నారు. అలవెన్సు కమిటీ జాప్యం చేస్తోందని మండిపడ్డారు. గడిచిన అయిదేళ్లల్లో ఉపాధి హామీ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రూ.27వేల కోట్లు ఇవ్వడం జరిగిందని, 58 లక్షల మంది పింఛన్లను తపాలా శాఖ ఉద్యోగులు అందిస్తున్నా, ప్రభుత్వం తమ సేవలను గుర్తించడం లేదన్నారు. పిజెసిఎ భీమవరం డివిజన్ అధ్యక్షులు బి గురుమూర్తి, కన్వీనర్ సిహెచ్ లెనిన్‌బాబు, ఎఎస్ ప్రకాశరావు, పి సుప్రభు తదితరులు పాల్గొన్నారు.
నల్లజర్ల మండల అభివృద్ధి అద్భుతం
ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్
నల్లజర్ల, మార్చి 13 : ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్, కలెక్టర్ కాటంనేని భాస్కర్ కలిసి నల్లజర్ల మండలంలో పర్యటించారు. నల్లజర్లలో అధునాతనంగా అభివృద్ధి చేసిన ఎర్ర చెరువును, అచ్చన్నపాలెంలో భూగర్భ డ్రెయినేజీ, సిసి రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, చెత్త సేకరణ విధానాన్ని పరిశీలించి ఇంతటి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి కారణమైన జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజును అభినందించారు. నల్లజర్ల మండలంలో అభివృద్ధి విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు కృషి చేస్తామన్నారు.కాగా, అచ్చన్నపాలెంలో కలెక్టర్ కాటంనేని భాస్కర్ బ్యాటరీ సాయంతో నడిచే చెత్త సేకరణ వాహనాన్ని నడిపి ఈ వాహనాలను జిల్లా వ్యాప్తంగా చెత్త సేకరణకు వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఆయనతో జడ్పీ చైర్మన్ ముళ్ళపూడి బాపిరాజు, ఎం పిపి జమ్ముల సతీష్, సర్పంచ్ యలమాటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.