పశ్చిమగోదావరి

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, మార్చి 16 : ఆక్వా రంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి దేశానికే పశ్చిమ ఆదర్శంగా నిలిచేలా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు జిల్లా కలెక్టర్‌ను కోరారు. స్థానిక కలెక్టరేట్‌లో గురువారం సాయంత్రం మంత్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ కాటంనేని భాస్కర్‌తో సమావేశమై జిల్లా అభివృద్ధిపై సమగ్రంగా చర్చించారు. ఆక్వా ఉత్పత్తుల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే 5వ స్థానంలో వుండగా రాష్ట్రంలో ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల్లో ఆక్వా ఉత్పత్తులు అధికంగా వున్నాయని చెప్పారు. పశ్చిమగోదావరి జిల్లా సముద్రతీర ప్రాంతంలో పెద్ద ఎత్తున చేపలు ఉత్పత్తి చేయడానికి అనువైన వాతావరణం ఉన్నదని ముఖ్యంగా డెల్టాలో ఆక్వా ఉత్పత్తులకు తగిన ప్రోత్సాహం కల్పించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతాంగానికి అందించడంలో జిల్లా యంత్రాంగం చేస్తున్న కృషి ప్రశంసనీయమని మంత్రి చెప్పారు. ఆర్ధిక వృద్ధి రేటు సాధించడంలో మత్స్య ఉత్పత్తులు కీలకపాత్ర పోషిస్తున్నాయని, ఇటువంటి స్థితిలో జిల్లాను ఆక్వా రంగంలో తగిన ప్రోత్సాహం కల్పిస్తే దేశంలోనే నాణ్యమైన మత్స్య సంపదను ప్రజలకు అందించగలుగుతామని ఆ దిశగా తగు నిర్మాణాత్మకమైన విధానాలను రూపొందించాలని సూచించారు. ప్రకృతి సమతుల్యత దెబ్బతినకుండా తక్కువ విస్తీర్ణంలో అధిక దిగుబడులు సాధించే మత్స్య ఉత్పత్తులను పెంచేలా రైతాంగాన్ని ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్న తీరు, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలులో ఎదురౌతున్న సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని మంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను నూరుశాతం కేంద్రమే భరిస్తూ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రధాని నరేంద్ర మోడీకి మంత్రి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిని మిళితం చేస్తూ లక్షా 50 వేల కోట్ల రూపాయలతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూపిన చొరవ అద్భుతమని చెప్పారు. నిరుద్యోగ యువతకు 500 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించడం హర్షనీయమని చెప్పారు. జిల్లా కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో ఆక్వా రంగం అభివృద్ధికి గత రెండేళ్ల కాలంలో చేపట్టిన చర్యల వల్ల అద్భుత ఫలితాలు లభిస్తున్నాయని, భవిష్యత్తు మరింత స్పష్టమైన ప్రగతి సాధించేలా క్షేత్రస్థాయిలో చేపట్టిన చర్యలను మంత్రికి వివరించారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకోసం ప్రత్యేకంగా 19 ఇళ్ల కాలనీలను ఏర్పాటు చేస్తున్నామని అన్ని రకాల వసతి సౌకర్యాలు కల్పిస్తామని ఆయన చెప్పారు. నిర్వాసితులకు సహాయక చర్యల్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు వున్నా క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నామని చెప్పారు. సమావేశంలో మద్ది ఆంజనేయస్వామి దేవస్థానం ఛైర్మన్ ఐ రంగరాజు తదితరులు పాల్గొన్నారు.