పశ్చిమగోదావరి

ఘంటసాల స్వర యుగం గ్రంథావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, మార్చి 23: ఘంటసాల స్వర యుగం గ్రంథావిష్కరణ మహోత్సవం శ్రీ మావుళ్లమ్మ దేవాలయ ప్రాంగణంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని విజ్ఞాన వేదిక చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో పట్టణ ప్రముఖులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సమక్షంలో నిర్వహించారు. గ్రంథాన్ని ఆవిష్కరించిన మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం ధర్మకర్తలమండలి ఛైర్మన్ కార్మూరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ ఘంటసాల పాటలు యుగాంతం వరకూ మరచిపోలేనివన్నారు. విశ్రాంత తహసీల్దార్ గంధం చెన్నుశేషు మాట్లాడుతూ సినీ ప్రపంచానికి భగవంతుడు అందించిన వరప్రసాదం ఘంటసాల అని, ఆయన జీవిత విశేషాలతో గ్రంథం రచించడం సమాజానికి ఎంతైనా అవసరమన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఎడి ఎల్‌బి సత్యనారాయణ, శ్రీ మావుళ్లమ్మ దేవస్థానం డైరెక్టర్లు డి వెంకటేశ్వరరావు, అడ్డాల సత్యనారాయణ, చంద్రశేఖర్, కట్టా వెంకటేశ్వరరావు, లంకె చిన్ని పాల్గొన్నారు. అనంతరం రచయిత స్వర్ణకుమార్‌ను అభినందించి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

డివైఎఫ్‌ఐ మోటార్ సైకిల్ ర్యాలీ
జంగారెడ్డిగూడెం, మార్చి 23: విప్లవజ్యోతి సర్థార్ భగత్‌సింగ్ 86వ వర్థంతి సందర్భంగా పట్టణంలో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. భగత్‌సింగ్ విగ్రహానికి చేరుకుని పూలమాలల వేసి నివాళులర్పించారు. రైతు సంఘం నేత బొడ్డు రాంబాబు, డివైఎఫ్‌ఐ పట్టణ కార్యదర్శి ఎస్‌కె మాబుసుభాని మాట్లాడుతూ భగత్ సింగ్ అతి చిన్న వయస్సులోనే బ్రిటీష్ సామ్రాజ్యవాదులపైన, పెట్టుబడిదారీ వ్యవస్థపైన తిరుగుబాటు చేసారని, నేటి ప్రభుత్వాలు స్వార్థ రాజకీయాల కోసం యువత భవిష్యత్‌తో ఆటలాడుకుంటున్నాయని విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగం వంటి కల్లబొల్లి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా యువతను విస్మరించిందన్నారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ డివిజన్ కార్యదర్శి వంగా రామగోపాల ప్రసాదరెడ్డి, నేతలు మునపర్తి ప్రసాద్, మునపర్తి అప్పారావు, కట్టుం సుబ్రహ్మణ్యం, షేక్ లాల్‌బాషా, పాకిరం ఏడుకొండలు, పెనుగోండ నాగపోసిబాబు, పాకిరం ఏడుకొండలు పాల్గొన్నారు.