పశ్చిమగోదావరి

మార్కెటింగ్‌లో నైపుణ్యం ప్రదర్శించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరపల్లి, మార్చి 25: పొగాకు రైతులు మార్కెటింగ్ విషయంలో నైపుణ్యం ప్రదర్శించాలని పొగాకు బోర్డు వైస్ ఛైర్మన్ బి సీతయ్య పేర్కొన్నారు. స్థానిక పొగాకు వేలంలో శనివారం ఆయన పొగాకు రేట్లను పరిశీలించి రైతులనుద్దేశించి మాట్లాడారు. ఈ సంవత్సరం పొగాకు రేట్లు ఆశాజనకంగా ఉంటాయని తాము భావిస్తున్నామన్నారు. రైతులు పొగాకు బోర్డు అధికారులు నిర్ధేశించిన కోటా ప్రకారం ప్రతి క్లస్టర్‌కు క్రమం తప్పకుండా పొగాకును వేలంలో విక్రయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంవత్సరం ఎఫ్‌ఎస్‌ఎల్, ఎస్‌పిఎస్‌ఎల్‌లో పొగాకు ఉత్పత్తి గణనీయంగా తగ్గిందని, 90 మిలియన్లు పొగాకు ఉత్పత్తి లక్ష్యం కాగా, 50 మిలియన్లు మాత్రమే ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. ఎన్‌ఎల్‌ఎస్ ఏరియాల్లో గత సంవత్సరం కన్నా ఏడు మిలియన్ కిలోలు పొగాకు ఉత్పత్తి అయిందని, రైతులకు పొగాకుకు గిట్టుబాటు ధర వచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. జూలై మొదటి వారంలో పొగాకు బోర్డు పాలకవర్గం సమావేశమై ప్రొడక్షన్ క్వాలిటీ నిర్ణయిస్తామని, రైతుల సమస్యలు, గిట్టుబాటు ధర విషయంలో కూడా చర్చిస్తామన్నారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ రైతులు విధిగా బీమా చేయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రైతు నాయకులు కాట్రు భీమరాజు, నరాలశెట్టి రాజేంద్రబాబు, సత్తి జగదీశ్వరరెడ్డి, పరిమి శ్రీరామకృష్ణ, యాగంటి సాయిబాబు, వేలం నిర్వహణాధికారి హనుమంతురావు, ఫీల్డ్ ఆఫీసర్ హేమస్మిత తదితరులు పాల్గొన్నారు.